పా రంజిత్ దర్శకత్వంలో విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా వచ్చిన సినిమా తంగలాన్. కోలార్ ఫీల్డ్స్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. విక్రమ్ నటనకి ప్రేక్షకులతో పాటు మర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుతున్నాయి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా మొదటిరోజే సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఫస్ట్ డేనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 26 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. ఈ సంవత్సరం తమిళనాడులో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో ఫస్ట్ డే హయ్యస్ట్ కలెక్షన్ సాధించిన మూడవ సినిమాగా తంగలాన్ నిలిచింది. దీనితో పాటు ఈసినిమా నార్త్ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. నార్త్ లో ఈసినిమా ఆగష్ట్ 30వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై కీలక పాత్రల్లో నటించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: