
ట్యాగ్ · 1187 కథనాలు · పేజీ 51


చిన్న సినిమాకు మెగా సాయం

కొత్త మూవీ షూట్ కు చైతు ప్లానింగ్

వైష్ణవ్ రంగ రంగ వైభవంగా కోసం మెగా హీరోలు

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా

ఆరోజునే హరిహర వీరమల్లు గ్లింప్స్?

గౌతమ్ బ్రేక్ అవుట్ ట్రైలర్

సాయి తేజ్, వరుణ్ తేజ్ లతో మల్టీస్టారర్ తీస్తా

నేను మాటిస్తున్నా అంటున్న నాగ్

భారీ సెట్‌లో రావణాసుర క్లైమాక్స్ షూట్

అక్టోబర్ నుండి ఆదిపురుష్ మేనియా

త్వరలో సెట్స్ పైకి దృశ్యం 3 మూవీ

స్టైలిష్ లుక్ లో కీర్తి సురేష్

#NC 22 మూవీ అప్ డేట్

#NBK 107 మూవీ లో బాలకృష్ణ న్యూ లుక్

SSMB28 మూవీ రెగ్యులర్ షూటింగ్ డేట్
శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా తెరకెక్కనున్న #SSMB 28 మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ పూజా కార్యక్రమానికి మహేష్ బాబు సతీమణి నమ్రత , హీరోయిన్ పూజాహెగ్డే హాజరు అయ్యారు. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న SSMB 28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #SSMB 28 మూవీ కై ఇటీవల కెజిఎఫ్ 2, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కి ఫైట్ మాస్టర్స్ గా వర్క్ చేసిన అన్బరివు సోదరులు యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించనున్నారని సమాచారం.

చిన్న సినిమాకు మెగా సాయం
పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్ పై శంకరాభరణం , సాగర సంగమం , స్వాతిముత్యం , స్వయంకృషి , సీతాకోక చిలక వంటి సూపర్ హిట్ మూవీస్ నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్ టైన్ మెంట్, మిత్ర వింద మూవీస్ బ్యానర్స్ పై వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్ రెడ్డి , సంచిత బసు జంటగా పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి మొదటి రోజు మొదటి ఆట చూడాలి అనే కాన్సెప్టుతో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రిలీజ్ కానుంది.

కొత్త మూవీ షూట్ కు చైతు ప్లానింగ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో బంగార్రాజు సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రీసెంట్ గా థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగచైతన్య. అయితే ఈసినిమా మాత్రం చైతుకు ఫ్లాప్ నే అందించింది. ఇక చైతు కూడా ఈసినిమా గురించి ముందుగానే ఉహించినట్టుగానే ఉన్నాడు. అందుకే ఈసినిమా ఫెయిల్యూర్ పై పెద్దగా స్పందించలేదు. దీనికి తోడు బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈసినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా కూడా చైతు ఎక్కడ నిరాశ చెందకుండా తన సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు.

హీరో రవితేజ చేతుల మీదుగా అధర్వ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తిక్ రాజు హీరోగా క్రైమ్ థ్రిల్లర్ అధర్వ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో తెరకెక్కుతుంది. సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

వైష్ణవ్ రంగ రంగ వైభవంగా కోసం మెగా హీరోలు
ఉప్పెన సినిమాతో తెలుగు సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం తను నటించిన తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు గిరీశాయ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. నిజానికి ఈ ఏడాది వేసవిలోనే విడుదల కావాల్సింది. కరోనా కారణంగా ఆగిన కొన్ని ముఖ్యమైన సినిమాలు లైనప్‌లోకి రావటంతో ఈసినిమా వెనక్కి తగ్గింది. ఇక ఇప్పుడు ఫైనల్ గా సెప్టెంబర్ 2 ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

రంగ రంగ వైభవంగా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - కేతిక శర్మ
ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూట్యూబర్‌గా.. సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో పాపులర్ అయ్యారు. కేతిక శర్మ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్‌లో 190 K ఫాలోవర్స్ ఉన్నారు.రొమాంటిక్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కేతిక తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాగశౌర్య లక్ష్య మూవీ లో కథానాయికగా నటించిన కేతిక ప్రేక్షకులను అలరించారు. దర్శకుడు గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా తెరకెక్కిన రంగ రంగ వైభవంగా మూవీ సెప్టెంబర్ 2 వ తేదీ రిలీజ్ కానుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాయి ధరమ్ తేజ్ మరో ముఖ్యపాత్రలో…

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. తమ అభిమాన హీరోల బర్త్ డే కు వారి పాత సూపర్ హిట్ మూవీస్ స్పెషల్ షోస్ థియేటర్స్ లో ప్రదర్శిస్తూ అభిమానులు తమ అభిమానం చాటుకుంటున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కు సూపర్ హిట్ పోకిరి మూవీ స్పెషల్ షోస్ భారీ వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే.మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే ఆగస్ట్ 22 కు హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ ఘరానా మొగుడు మూవీ స్పెషల్ షోస్ ను 21 , 22 తేదీలలో ప్రదర్శించిన విషయం తెలిసిందే.

ఆరోజునే హరిహర వీరమల్లు గ్లింప్స్?
ఆగష్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ఇప్పటికే సందడి చేశారు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 2వ తేదీ రాబోతుంది. పవన్ పుట్టినరోజు రాబోతుంది ఇక ఇప్పటినుండే మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ హడావుడి మొదలవుతుంది. ఇక పవన్ పుట్టినరోజుకు తన సినిమాల నుండి అప్ డేట్స్ కూడా వస్తాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ‘హరి హర వీరమల్లు’ నుంచి అదిరిపోయే పోస్టర్ మరియు గ్లింప్స్ ను వదలబోతున్నట్టు తెలుస్తోంది.

కార్తికేయ 2 మూవీ పై గుజరాత్ సీ ఎం భూపేంద్ర భాయ్ పటేల్ ప్రశంసలు
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది…

గౌతమ్ బ్రేక్ అవుట్ ట్రైలర్
బ్రహ్మానందం తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గౌతమ్ ఆశించినంత సక్సెస్ అయితే దక్కలేదని చెప్పొచ్చు. తండ్రి కామెడీ కింగ్ గా ఇండస్ట్రీని ఏలినా కూడా తనయుడు మాత్రం తండ్రి రేంజ్ లో సినీ ఇండస్ట్రీలో మాత్రం కెరీర్ ను నిలదొక్కుకోలేకపోయాడు. అప్పుడుప్పుడు మాత్రం ఒక్కో సినిమాతో పలకరిస్తున్నాడు. మను సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న గౌతమ్ ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో బ్రేక్ అవుట్ అనే సినిమాతో రాబోతున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

సాయి తేజ్, వరుణ్ తేజ్ లతో మల్టీస్టారర్ తీస్తా
ఇప్పుడు మల్టీస్టారర్లు తీయడానికి కూడా హీరోలు ఏమాత్రం వెనుకాడట్లేదు అన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే సాయి తేజ్ ఇంకా వరుణ్ తేజ్ లతో మల్టీస్టారర్ తీస్తా అంటున్నాడు మరో మెగా హీరో. ఆ మెగా హీరో ఎవరో కాదు మెగా కాంపౌండ్ నుండి ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో సంచలనం సృష్టించిన వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ నుండి వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా. గిరీశయ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇంకా పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

డాన్స్ ఇండియా డాన్స్ షో మహేష్ బాబు ,సితార ప్రోమో రిలీజ్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక, అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గాబ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా SSMB28 మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

నేను మాటిస్తున్నా అంటున్న నాగ్
నేడు అక్కినేని నాగార్జున తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈసందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీల నుండి ఫ్యాన్స్ నుండి ఇంకా పలువురు ప్రముఖుల నుండి విషెస్ అందుతున్నాయి. ఈనేపథ్యంలో తన కొత్త సినిమాల నుండి స్పెషల్ పోస్టర్లతో అప్ డేట్స్ ఇచ్చారు. ఇక ఈసందర్భంగా నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్ చెబుతూ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈరోజు ఉదయం నుండి చాలా ఫోన్ కాల్స్, మెసేజెస్, ఇంకా సోషల్ మీడియాలో కూడా చాలా మెసేజెస్ వచ్చాయి. మీ అందరి విషెస్ కు అలానే బ్లెస్సింగ్స్ కు చాలా థ్యాంక్స్. నాకు సెప్టెంబర్ ఇంకా అక్టోబర్ లో మూడు పెద్ద…

భారీ సెట్‌లో రావణాసుర క్లైమాక్స్ షూట్
మాస్ మహారాజా రవితేజ మంచి స్పీడుమీదున్నాడు. ఒక సినిమాను రిలీజ్ చేసిన వెంటనే మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు రవితేజ. ఈనేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

అక్టోబర్ నుండి ఆదిపురుష్ మేనియా
ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమాలో ప్రభాస్ కెరీర్ లో మొదటిసారి రాముడిపాత్రలో నటిస్తుండటంతో ఈసినిమా కోసం కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు ఇటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. షూటింగ్ తొందరగా అయిపోయినా కూడా భారీ విఎఫ్ఎక్స్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ కే ఎక్కువ టైమ్ పడుతుండటంతో రిలీజ్ లేట్ అవుతుంది.

త్వరలో సెట్స్ పైకి దృశ్యం 3 మూవీ
భారత సినీ పరిశ్రమలో ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వం లో మలయాళ సూపర్ స్టార్ హీరో గా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం మూవీ ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ దృశ్యం మలయాళ మూవీ తెలుగు , కన్నడ , తమిళ , హిందీ భాషలలో రీమేక్ అయ్యి అన్ని భాషలలోనూ ఘనవిజయం సాధించింది. దృశ్యం సీక్వెల్ దృశ్యం 2 మూవీ కూడా ప్రేక్షకులను అలరించింది. సూపర్ హిట్ అయిన దృశ్యం , దృష్యం తెలుగు రీమేక్ మూవీస్ లో విక్టరీ వెంకటేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

స్టైలిష్ లుక్ లో కీర్తి సురేష్
తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.“భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా(తెలుగు ), , మామన్నన్ (తమిళ ), వాషి (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు. తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సుధా కొంగర దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుంది.

ఇన్ స్టా గ్రామ్ లో వన్ మినిట్ మ్యూజిక్ వీడియోస్ అనౌన్స్ చేసిన సింగర్ సునీత
సింగర్ , టి వి ప్రెజెంటర్ , వాయిస్ ఆర్టిస్ట్ సునీత ప్లే బ్యాక్ సింగర్ గా గులాబి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ సింగర్ గా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ , కన్నడ భాషలలో సుమారు 3000 సాంగ్స్ తో సునీత తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.టాలెంటెడ్ సింగర్ సునీత ప్లే బ్యాక్ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 9నంది , బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. పలు మ్యూజిక్ బేస్డ్ టివి ప్రోగ్రామ్స్ కు సునీత యాంకర్ , హోస్ట్ గా పనిచేశారు.

#NC 22 మూవీ అప్ డేట్
పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య , కృతి శెట్టి జంటగా తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న NC 22 మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దర్శకులు బోయపాటి , భారతీ రాజా , శివ కార్తికేయన్ , రానా అతిథులు గా పాల్గొన్నారు. ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.

#NBK 107 మూవీ లో బాలకృష్ణ న్యూ లుక్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK 107 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ #NBK 107 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బర్త్ డే (జూన్ 10)సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్…