నేడు అక్కినేని నాగార్జున తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈసందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీల నుండి ఫ్యాన్స్ నుండి ఇంకా పలువురు ప్రముఖుల నుండి విషెస్ అందుతున్నాయి. ఈనేపథ్యంలో తన కొత్త సినిమాల నుండి స్పెషల్ పోస్టర్లతో అప్ డేట్స్ ఇచ్చారు. ఇక ఈసందర్భంగా నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్ చెబుతూ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈరోజు ఉదయం నుండి చాలా ఫోన్ కాల్స్, మెసేజెస్, ఇంకా సోషల్ మీడియాలో కూడా చాలా మెసేజెస్ వచ్చాయి. మీ అందరి విషెస్ కు అలానే బ్లెస్సింగ్స్ కు చాలా థ్యాంక్స్. నాకు సెప్టెంబర్ ఇంకా అక్టోబర్ లో మూడు పెద్ద ఈవెంట్స్ జరగబోతున్నాయి.. ఒకటి బిగ్ బాస్, మరొకటి బ్రహ్మాస్త్ర ఇంకోటి ది ఘోస్ట్ సినిమా. ది ఘోస్ట్ ట్రైలర్ కు అంత రెస్పాన్స్ ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్. మీ అందరినీ తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తానని మాటిస్తున్నా అంటూ వీడియోలో తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Overwhelmed!!🙏🙏🙏 pic.twitter.com/JCQncuYUVE
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 29, 2022
కాాగా ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ది ఘోస్ట్ సినిమా వస్తుంది. యాక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా బ్రహాస్త్ర సినిమాతో బాలీవుడ్ లో చాలా ఏళ్ల తరువాత రీఎంట్రీ ఇస్తున్నారు. ఈసినిమా సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























