ఆగష్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ఇప్పటికే సందడి చేశారు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 2వ తేదీ రాబోతుంది. పవన్ పుట్టినరోజు రాబోతుంది ఇక ఇప్పటినుండే మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ హడావుడి మొదలవుతుంది. ఇక పవన్ పుట్టినరోజుకు తన సినిమాల నుండి అప్ డేట్స్ కూడా వస్తాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ‘హరి హర వీరమల్లు’ నుంచి అదిరిపోయే పోస్టర్ మరియు గ్లింప్స్ ను వదలబోతున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొగలుల కాలం నాటి పీరియాడిక్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ రెండేళ్ల క్రితమే మొదలైంది. కానీ కరోనా వల్ల మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో లేట్ అవుతూ వస్తుంది. ఇక ఈసినిమా నుండి మేకర్స్ అప్ డేట్ ఇచ్చి చాలా కాలమే అవుతుంది. అయితే పవన్ బర్త్ డే కి మాత్రం సాలిడ్ అప్ డేట్ వస్తుందని మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా నుండి దాదాపు 40 సెకన్ల పాటు ఉండే గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఇదిలా ఉండగా పవన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే స్పెషల్ షోస్ ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. ‘జల్సా’ తమ్ముడు 4కే వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు. రెండు రోజుల్లో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొననుంది. ఇప్పటికే థియేటర్లలో ఆన్ లైన్ బుక్కింగ్స్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ లోనూ ఈ చిత్రలాను గ్రాండ్ గా రీరిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: