కొత్త మూవీ షూట్ కు చైతు ప్లానింగ్

Naga Chaitanya new movie shoot to begin soon, Naga Chaitanya start shooting for next film, Naga Chaitanya new movie shoot, Naga Chaitanya New Movie Shooting Started, Akkineni Naga Chaitanya, Naga Chaitanya, Naga Chaitanya New Movie Update, Naga Chaitanya New Movie Latest Update, Naga Chaitanya Latest Movie, Naga Chaitanya Upcoming Movie, NC new movie shoot, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో బంగార్రాజు సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రీసెంట్ గా థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగచైతన్య. అయితే ఈసినిమా మాత్రం చైతుకు ఫ్లాప్ నే అందించింది. ఇక చైతు కూడా ఈసినిమా గురించి ముందుగానే ఉహించినట్టుగానే ఉన్నాడు. అందుకే ఈసినిమా ఫెయిల్యూర్ పై పెద్దగా స్పందించలేదు. దీనికి తోడు బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈసినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా కూడా చైతు ఎక్కడ నిరాశ చెందకుండా తన సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా సమాచారం ప్రకారం చైతు ఇప్పుడు తన కొత్త సినిమాపై దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తుంది. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చైతు సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించాలని చూస్తున్నాడట చైతు. దీనికోసం డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. సెప్టెంబర్ 5వ తేదీ నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారట.

కాగా మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటించబోతుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కించున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 2 =