కార్తికేయ 2 మూవీ పై గుజరాత్ సీ ఎం భూపేంద్ర భాయ్ పటేల్ ప్రశంసలు

Gujarat CM Praises Nikhil’s Karthikeya 2 Movie,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Shri Bhupendra Rajnikant Patel,Gujarat CM Shri Bhupendra Rajnikant Patel,Shri Bhupendra Rajnikant Patel Praises karthikeya 2 Movie,Gujarat Cm Praises Karthikeya 2 Movie,Nikhil Siddhartha latest Movie Karthikeya 2,Karthikeya 2 Movie Latest Updates,Nikhil Upcoming Movie Updates,Nikhil New Movie Updates, Nikhil Siddhartha Latest Blockbuster Movie Karthikeya 2

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది.తాజాగా కార్తికేయ2 రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్తికేయ 2 మూవీ 3 వేల స్క్రీన్లలో ప్రదర్శించబడటం విశేషం. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో 16 రోజులు కలిపి రూ.23.53 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీ కృష్ణుడి నేపథ్యంలో చరిత్ర మరియు పురాణాల గురించి తెలియజేసే యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో అన్ని భాషల ఆడియన్స్ కార్తికేయ 2 సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. ఈమూవీ పై సినీ , రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా చూసిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్.. చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కార్తికేయ-2 లాంటి సినిమాలు మరెన్నో రావాలని భూపేంద్ర భాయ్ మనస్పూర్తిగా కోరుకున్నారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మరియు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రత్యేకంగా గుజరాత్ సీఎం ని కలిసిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eighteen =