బ్రహ్మానందం తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గౌతమ్ ఆశించినంత సక్సెస్ అయితే దక్కలేదని చెప్పొచ్చు. తండ్రి కామెడీ కింగ్ గా ఇండస్ట్రీని ఏలినా కూడా తనయుడు మాత్రం తండ్రి రేంజ్ లో సినీ ఇండస్ట్రీలో మాత్రం కెరీర్ ను నిలదొక్కుకోలేకపోయాడు. అప్పుడుప్పుడు మాత్రం ఒక్కో సినిమాతో పలకరిస్తున్నాడు. మను సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న గౌతమ్ ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో బ్రేక్ అవుట్ అనే సినిమాతో రాబోతున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను చాలా సైలెంట్ గా పూర్తి చేశారు మేకర్స్. రెండు రోజుల క్రితమే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా నేడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు చిత్రబృందం. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మోనో ఫోబియాతో బాధపడే హీరో అనుకోని పరిస్థితిలో వంటరిగా ఒక గ్యారేజ్ లో చిక్కుకుపోతాడు. వంటరిగా చిక్కుకున్న హీరో అక్కడి నుండి బయటపడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? మోనో ఫోబియాతో హీరో ఎలాంటి సవాళ్ళని ఎదురుకున్నాడనేది సినిమా కథ. గౌతమ్ కూడా తన మేకోవర్ ను మార్చి కొత్తగా ప్రయత్నిస్తున్నాడు. మరి చూద్దాం ఈ సినిమాతో అయిన్ గౌతమ్ కెరీర్ కు మళ్లీ బ్రేక్ వస్తుందేమో..
Happy to launch the trailer of #BreakOut. The concept of the movie looks interesting. It’s good to see a young team in TFI experimenting with such stories. My best wishes to #RajaGoutham, director @its_Subbu4U and the whole cast & crew.https://t.co/sJ6BlKpa4N
— Allu Arjun (@alluarjun) August 29, 2022
ఈ మూవీని ఏఎంఎఫ్ బ్యానర్ పై అనీల్ మెడుగా నిర్మిస్తున్నారు. జాన్స్ రుపెర్ట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ బసవ ఎడిటర్ గా చేస్తున్నారు. చూద్దాం మరి ఈ బ్రేక్ అవుట్ తో అయినా గౌతమ్ కెరీర్ కు మంచి బ్రేక్ వస్తుందేమో.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































