భారత సినీ పరిశ్రమలో ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వం లో మలయాళ సూపర్ స్టార్ హీరో గా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం మూవీ ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ దృశ్యం మలయాళ మూవీ తెలుగు , కన్నడ , తమిళ , హిందీ భాషలలో రీమేక్ అయ్యి అన్ని భాషలలోనూ ఘనవిజయం సాధించింది. దృశ్యం సీక్వెల్ దృశ్యం 2 మూవీ కూడా ప్రేక్షకులను అలరించింది. సూపర్ హిట్ అయిన దృశ్యం , దృష్యం తెలుగు రీమేక్ మూవీస్ లో విక్టరీ వెంకటేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో దృశ్యం 3 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని నిర్మాత ఆంటోని పెరుంబవూర్ ఒక కార్యక్రమంలో ప్రకటించారు. మూడో పార్టు కాన్సెప్ట్ లైన్ ను హీరో మోహన్ లాల్‌కు దర్శకుడు చెప్పగా ఆయనకు నచ్చిందని సమాచారం.దృశ్యం మూవీ మూడో పార్టుకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు తెలియాల్సి ఉంది. దృశ్యం 3 మాతృక వస్తే.. తెలుగులో వెంకటేష్ హీరోగా దీన్ని రీమేక్ చేసే అవకాశాలు లేకపోలేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: