వైష్ణవ్ రంగ రంగ వైభవంగా కోసం మెగా హీరోలు

Mega Heroes To Grace Ranga Ranga Vaibhavanga Pre Release Event,Ranga Ranga Vaibhavanga Pre Release Event Details,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Ranga Ranga Vaibhavanga,Ranga Ranga Vaibhavanga Movie Trailer,Ranga Ranga Vaibhavanga Pre Release Event,Ranga Ranga Vaibhavanga Telugu Movie Pre Release Event,Ranga Ranga Vaibhavanga Movie latest Pre Release Event Updates,Hero Vaishnav Tej,Vaisshnav Tej Upcoming Movie Ranga Ranaga Vaibhavanga,Director Gireeshaaya,Director Gireeshaaya Ranga Ranga Vaibhavanga Movie latest Pre Release Event Details,Panja Vaisshnav Tej and Ketika Sharma,Ranga Ranga Vaibhavanga pre-release event,Ranga Ranga Vaibhavanga Pre Release Event at Park Hyatt

ఉప్పెన సినిమాతో తెలుగు సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం తను నటించిన తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు గిరీశాయ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. నిజానికి ఈ ఏడాది వేస‌విలోనే విడుద‌ల కావాల్సింది. క‌రోనా కార‌ణంగా ఆగిన కొన్ని ముఖ్య‌మైన సినిమాలు లైన‌ప్‌లోకి రావ‌టంతో ఈసినిమా వెనక్కి తగ్గింది. ఇక ఇప్పుడు ఫైనల్ గా సెప్టెంబర్ 2 ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఈరోజు 5గంటల నుండి నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి అతిథులుగా మరో ఇద్దరు మెగా హీరోలుగా రానున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి తేజ్ గెస్ట్ లుగా రానున్నారు. దీంతో ఈ ఈవెంట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ప్రభు, నరేష్, సుబ్బరాజు, తులసి, ప్రగతి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉప్పెన సినిమాకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 19 =