మాస్ మహారాజా రవితేజ మంచి స్పీడుమీదున్నాడు. ఒక సినిమాను రిలీజ్ చేసిన వెంటనే మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు రవితేజ. ఈనేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రొడక్షన్ డిజైనర్ డిఆర్కె కిరణ్ పర్యవేక్షణలో నిర్మించిన 5 కోట్ల రూపాయల భారీ సెట్‌లో క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. స్టన్ శివ స్టైలిష్, డిఫరెంట్ యాక్షన్ బ్లాక్‌ని డిజైన్ చేసినట్టు సమాచారం.
కాగా ఈసినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: