అఖిల్ అక్కినేని కథానాయకుడిగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి గోపిసుందర్ బాణీలు సమకూరుస్తున్నాడు. ‘గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్’ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా దర్శనమివ్వనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాని 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం… అఖిల్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే విడుదల తేదిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి… బర్త్ డే స్పెషల్ గా రానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయినా… అఖిల్ కి కథానాయకుడిగా తొలి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: