అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళాలో జరుపుకుంటుంది. ఒక సాంగ్ ను, కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తారట చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ ఇవ్వనుంది చిత్రయూనిట్. ‘సరిలేరు’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేశారట. డిసెంబర్ 1 న మొదటి పాటను విడుదల చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. మరి చూద్దాం ఆ రోజు రిలీజ్ చేస్తారో..?లేదో?
కాగా ఈ సినిమాలో విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తుండగా..ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, ఆది పినిశెట్టి ఆయా పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయనున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: