కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 14

రిలీజ్ అప్‌డేట్

ఉండి పోరాదే సెన్సార్ పూర్తి - రిలీజ్ డేట్ ఫిక్స్

నవీన్ నాయని దర్శకత్వంలో హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘ఉండి పోరాదే’. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండా.. యూ ఏ సర్టిఫికెట్ పొందింది. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా సొంతం చేసుకుంది. ఆగష్టు 31 న గ్రాండ్ గా విడుదలవుతుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Costly House Set Erected for Allu Arjun and Trivikram Movie, Allu Arjun and Trivikram Movie Latest News, Costly House Set For Allu Arjun Movie, Ala Vaikunthapuramlo Costly house set ready for shoot, Fabulous house set er
సినిమా వార్తలు

బ‌న్నీ సినిమా కోసం భారీ సెట్‌!?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా నటిస్తున్న 19వ చిత్రం ‘అల... వైకుంఠపురములో...’. ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్న‌ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో... బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. టబు, జయరామ్, రాజేంద్రప్రసాద్, సుశాంత్, నివేదా పేతురాజ్, న‌వ‌దీప్‌, సునీల్‌ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Kiccha Sudeep Coming Up with Interesting Projects, Kiccha Sudeep Latest Movie News, Interesting Projects by Kiccha Sudeep, Kiccha Sudeep busy With Interesting Projects, Kiccha Sudeep Ropped An Interesting Role, Kiccha Su
సినిమా వార్తలు

త‌క్కువ గ్యాప్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ప‌ల‌క‌రించ‌నున్న సుదీప్‌

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’(2012)తో ప్రతినాయకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్. తొలి అడుగులోనే తెలుగు ప్రేక్షకులకు చేరువైన‌ ఈ శాండల్‌వుడ్ హీరో... ఆపై ‘బాహుబలి: ది బిగినింగ్’లోనూ తళుక్కున మెరిసాడు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ‘ప‌హిల్వాన్’, ‘సైరా నరసింహారెడ్డి’, ‘మరక్కర్: అరబికడ‌లింటే సింహం’, ‘దబాంగ్ 3’ వంటి నాలుగు వేర్వేరు భాషలకు చెందిన క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు సుదీప్‌. అంతేకాదు... వీటిలో మూడు చిత్రాలు త‌క్కువ గ్యాప్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Rajinikanth AR Murugadoss Darbar to Come for 2020 Sankranthi, Darbar Movie Release Updates, Darbar Movie Release Date, Darbar Planning To Release For Sankranthi, Rajinikanth's Darbar to release for 2020 Sankranthi, Telug
సినిమా వార్తలు

ప‌ండ‌గ‌ల‌ను టార్గెట్ చేసుకుంటున్న సూప‌ర్ స్టార్‌

సూపర్ స్టార్ రజినీకాంత్ వ‌రుస‌గా పండ‌గ‌ల‌ను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి `పేట‌`తో అల‌రించిన ర‌జినీ... త‌న త‌దుప‌రి చిత్రాల‌ను వ‌చ్చే ఏడాది సంక్రాంతి, దీపావ‌ళికి టార్గెట్ చేసుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Pawan Kalyan Gokulamlo Seeta Completes 22 Years, Gokulamlo Seeta Telugu Movie,22 Years For Gokulamlo Seeta Movie, 22 Glorified Years For Gokulamlo Seeta, Gokulamlo Seeta Movie Latest News, Gokulamlo Seeta Movie Clocks 22
సినిమా వార్తలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘గోకులంలో సీత’కు 22 ఏళ్ళు

‘గోకులంలో సీత’... కళ్యాణ్‌ను కాస్త‌ పవన్ కళ్యాణ్‌గా మార్చిన సినిమా. అంతేకాదు... ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రెండో చిత్రంగా విడుద‌లై... అత‌నికి తొలి విజయాన్ని అందించిందీ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. తమిళ చిత్రం ‘గోకులత్తిల్ సీతై’కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. రాశి కథానాయికగా న‌టించిన ఈ చిత్రంలో... హరీష్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, అలీ, సుధాకర్, ప్రియ, శ్రీహరి, ర‌క్ష‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Chiranjeevi Chantabbai Completes 33 Years, Chiranjeevi Chantabbai Telugu Movie,33 Years For Chantabbai Movie, 33 Glorified Years For Chantabbai, Chantabbai Movie Latest News, Chantabbai Movie Clocks 33 Years, Telugu Film
సినిమా వార్తలు

చిరంజీవి ‘చంటబ్బాయ్’కు 33 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి... ఈ పేరు చెబితే ఎవ‌రికైనా ముందుగా గుర్తొచ్చేది ముచ్చ‌ట‌గొలిపే హావ‌భావాలు, క‌నువిందైన నృత్య విన్యాసాలు. తన నర్తనంతో, నటనతో, ఫైట్స్‌తో తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన చిరు... కామెడీ పండించడంలోనూ సిద్ధహస్తుడే. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో పలు హాస్యభరిత చిత్రాలలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు చిరు. అటువంటి చిత్రాలలో ముందువరుసలో ఉండే క్లాసిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘చంటబ్బాయ్’. చిరంజీవిలోని హాస్యచతురతతో పాటు కామెడీ టైమింగ్‌ను కూడా నూటికి నూరు పాళ్ళు వాడుకున్నారు చిత్ర దర్శకుడు, “హాస్య బ్రహ్మ” జంధ్యాల. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన `చంట‌బ్బాయ్‌` నవలాధారంగా అదే పేరుతో…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Pawan Kalyan Emotional Birthday Wishes to Chiranjeevi, Megastar Chiranjeevi Birthday Celebrations, Pawan Kalyan Special Birthday Wishes To Chiranjeevi, Chiranjeevi Received Wishes From Pawan Kalyan, Pawan Kalyan Latest M
బర్త్‌డే స్పెషల్స్

తానే ఒక సందోహం.. తన జీవితమొక సందేశం..!

తెలుగు సినీ పుస్తకంలో ఎందరో స్టార్ సూపర్ స్టార్ల పేర్లు లిఖించబడ్డాయి. తమ స్వకష్టంతో పైకి వచ్చి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచేది మాత్రం కొంతమందే. అలాంటి వాళ్ళ పేర్లు మాత్రం మనుషుల గుండెల్లో రాయబడతాయి. అలా ఎంతోమంది గుండెల్లో అభిమాన హీరోగా నిలిచిపోయిన ఓ 'స్వయంకృషి', ఓ 'ఆపద్భాందవుడు' కొణిదల 'కొదమసింహం' శివశంకర వరప్రసాద్. అదే మన సూపర్ స్టార్ చిరంజీవి.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Rumors on Vijay Sethupathi Opting Out from Vaishnav Tej Movie, Rumors on Vijay Sethupathi, Vaishnav Tej Movie, All The Rumors On Uppena End With Vijay Sethupathi Words, Vijay Sethupathi Comments on Rumors, Vijay Sethupat
సినిమా వార్తలు

అవన్నీ రూమర్లే అన్నమాట..!

మెగా కాంపౌండ్ నుండి టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు దర్శకత్వం లో ఉప్పెన అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. విజయ్ సేతుపతి తప్పుకుంటున్నట్లు రూమర్లు వినిపించాయి. ఈ రూమర్లపై చిత్ర బృందం నుంచి ఎవ్వరూ ఖండించకపోవడంతో అది నిజమే అనుకున్నారంతా.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'హవా' రిలీజ్ డేట్ ఖరారు

ప్రస్తుతం థ్రిల్లర్ మూవీస్ కే మార్కెట్ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేక్షకులు థ్రిల్లింగ్ నే ఎక్కువ కోరుకుంటున్నారు. సినిమాలో ఎన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే సినిమా అంత హిట్ అయినట్టు లెక్క. అందుకే మేకర్స్ కూడా ఇలాంటి సినిమాలు తీయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక తాజాగా వచ్చిన మంచి హిట్ కొట్టిన రాక్షసుడు, ఎవరు ఈ ట్రెండ్ ను రుజువు చేశాయి. ఇప్పుడు అదే బాటలో మరో వినూత్న కథనంతో వస్తున్న సినిమా 'హవా'.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Tollywood Upcoming Movies For 2020 Sankranti, Telugu Movies Releasing For Sankranth, 2020 Sankranti Releasing movies, Upcoming Telugu Movies For Sankranti 2020, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema New
సినిమా వార్తలు

2020 సంక్రాంతి మూవీ సందడి

2020 సంవత్సరం సంక్రాంతి పండుగ నలుగురు స్టార్ హీరోల మూవీస్ రిలీజ్ లతో సందడిగా మారనుంది. తెలుగు వారి అతి పెద్ద పండుగ సంక్రాంతి. పండుగ సీజన్ లో వసూళ్ళు అధికంగా ఉంటాయని నిర్మాతలు తమ మూవీస్ ను సంక్రాంతి పండుగ కు రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో, రజనీకాంత్ దర్బార్, బాలకృష్ణ , KS రవికుమార్ కాంబినేషన్ మూవీ సంక్రాంతి బరిలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'ఏదైనా జరగొచ్చు' రిలీజ్ డేట్ ఫిక్స్

శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా కె.రమాకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఆగష్ట్ 23వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక తమిళ మూవీ టైటిల్ సుల్తాన్

శాండల్ వుడ్, టాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రష్మిక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు, నితిన్ హీరోగా రూపొందుతున్న భీష్మ, ధృవ సర్జా హీరోగా రూపొందుతున్న కన్నడ మూవీ పొగరు మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ AA 20 మూవీ లో హీరోయిన్ గా ఎంపికయ్యారు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరుపొందిన రష్మిక , కార్తీ హీరోగా రూపొందుతున్న మూవీ తో కోలీవుడ్ కు ఎంటరయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రాజ్ తరుణ్ కు తప్పిన ప్రమాదం..!

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ ఇప్పుడిపుడే వరుస సినిమాలను కమిట్ అవుతూ కెరీర్ ను గాడిలో పెట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే గుండె జారి గల్లంతయ్యిందే ఫేం కొండా విజయ్‌ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. దీనితో పాటు దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాలో రాజ్‌తరుణ్‌ నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Prabhas Opens Up About Upcoming Big Budget Movies, Prabhas About Upcoming movie Projects, Prabhas Latest Movie News, Prabhas Comments on Upcoming High Budget Movies, Saaho Movie Latest News, Telugu Film updates, Telugu F
సినిమా వార్తలు

ప్రభాస్ మనసులో మాట

భారతీయ చలన చిత్ర పరిశ్రమ లో తనకంటూ ఒక గుర్తింపు పొందిన స్టార్ హీరో ప్రభాస్ ప్రతీ విషయం లో కూల్ గా ఉంటారు . బాహుబలి మూవీ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న ప్రభాస్ ఒక ఇంటర్ వ్యూ లో మాట్లాడుతూ .. తాను నటించిన మూవీ ని మొదటిరోజు చూడాలనుకొంటాను కానీ, ధైర్యం చాలదని, సాహో మూవీ ని కూడా 4లేదా 5రోజుల తరువాత థియేటర్ లో చూస్తానని అన్నారు. బాహుబలి తరువాత ఒక లవ్ స్టోరీ లో నటించాలనుకున్నా నని, సరైన స్క్రిప్ట్ లభించలేదని, ఆ టైమ్ లో దర్శకుడు సుజీత్ సాహో స్క్రిప్ట్ తో కలిశారని ప్రభాస్ చెప్పారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Nabha Natesh Opens Up About Her Character in Disco Raja Movie, Nabha Natesh Express Her Role in Disco Raja Movie, Nabha Natesh Ropped an Interesting Role, Nabha Natesh Role in Disco Raja Movie, Disco Raja Movie Latest ne
సినిమా వార్తలు

గ్లామర్ డాల్ ను కాదు - నభా నటేష్

నన్ను దోచుకుందువటే మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన నభా నటేష్ సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ సొంతం చేసుకున్నారు. నభా నటేష్ ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ హీరోగా రూపొందుతున్న డిస్కో రాజా మూవీ లో నటిస్తున్నారు. నభా నటేష్ మాట్లాడుతూ .. VI ఆనంద్ దర్శకత్వం లో రవితేజ హీరోగా రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా మూవీ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న హెడ్ స్ట్రాంగ్ యువతిగా నటించానని, రవితేజ, తన మీద చిత్రీకరించిన సన్నివేశాలు వర్త్ వాచ్ అన్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Balakrishna First Look From His Upcoming Movie Revealed, Balakrishna First Look From New movie, Balakrishna First Look, Balakrishna Latest Movie News, Balakrishna new look for KS Ravikumar film, Balakrishna And KS Raviku
ఫస్ట్ లుక్

వాన్ డైక్ తరహాలో బాలకృష్ణ న్యూ లుక్

సోషల్ మీడియా లో ప్రస్తుతం బాలకృష్ణ హల చల్ చేస్తున్నాడు. ఇంతకీ ఏ విషయం లో అనుకుంటున్నారా? బాలకృష్ణ అంటే బాలకృష్ణ ఫొటోస్ అన్నమాట.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ కు సంబంధించి ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రిమ్డ్ ఫ్రెంచ్ షేవ్ లో ఉన్న బాలయ్య ఫోటోని చూసిన అభిమానులు అవాక్కవ్వడంతో పాటు లైక్ ల మీద లైక్ లు కొడుతున్నారు. అసలు ఇటీవల నటించిన సినిమాల్లో బాలయ్య ఎప్పుడు ఇలాంటి లుక్ లో కనపడలేదు. వాన్ డైక్ తరహా గడ్డంతో బాలకృష్ణ సూటూబూటూ ధరించి కొత్త లుక్ తో ఆకర్షణీయంగా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అది మా అబ్బాయి తరుణ్ కాదు...రాజ్ తరుణ్ అంట.. సీనియర్ నటి రోజా రమణి వివరణ - ఆవేదన

రాను రాను మీడియా సంయమనం కోల్పోతుంది . ఎక్స్ క్లూజివ్ న్యూస్, ఫస్ట్ న్యూస్ అనే పరుగు పందెంలో నేను ముందంటే నేను ముందు అనే హడావిడిలో పడి తప్పు వార్తలు, తప్పుడు వార్తలు ప్రసారం చేయడంతో మీడియా తన ప్రతిష్టను, విశ్వసనీయతను కోల్పోతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ సమీపంలో జరిగిన చిన్న ప్రమాద వార్త లోని వాస్తవాలను తెలుసుకోకుండా ప్రమాద కారకుడిగా ఒకరి పేరుకు బదులు మరొకరి పేరును పదే పదే ప్రచారం చేసి గందరగోళం సృష్టించింది మీడియా.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ సెట్ లోనే ప్రాక్టీస్ చేసేవాడు..!

సాహో నుండి రోజుకో అప్ డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ‘సైకో సైయ్యా’ అంటూ ఒక క్లబ్ సాంగ్ వచ్చింది. ఆ తరవాత ఒక డ్యుయెట్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ అప్ డేట్ ఇస్తూ రెండు పాటలను రిలీజ్ చేయగా.. ఎలాంటి అప్ డేట్ లేకుండా నిన్న మూడో పాటను రిలీజ్ చేశారు. బ్యాడ్ బాయ్ అనే పాటను రిలీస్ చేసి షాకిచ్చింది చిత్రయూనిట్. బ్యాడ్ బాయ్ పేరుతో విడుదలైన ఆ సాంగ్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడిపాడుతూ ప్రభాస్ నిజంగా బ్యాడ్ బాయ్ అనిపించాడు. సాంగ్ లో ప్రభాస్, బాలీవుడ్ భామ జాక్విలిన్ పెర్నాండెజ్ ఇద్దరూ స్టెప్పులతో అదరగొట్టారు.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

నేషనల్ వైడ్ గా టాప్ 10 లో ఎవరు

సినిమా సినిమా కు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. ‘క్షణం’,‘గూఢచారి’ వంటి డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకులను అలరించిన శేష్.. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ కొత్త మార్క్ ను చూపిస్తూ యంగ్ హీరో లకు పోటీ ఇస్తున్నాడు. తాజాగా ‘ఎవరు’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి అడివి శేష్ మరో హిట్ అందుకున్నాడు. ఆగస్టు 15న విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వెంకట్ రామ్‌జీ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ కాన్సెప్ట్ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి సీన్ అద్భుతంగా.. ఊహించని మలుపులు, ట్విస్టులతో ఉన్న ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Dr Rajasekhar to do an Emotional Thriller next, Emotional Thriller by Rajasekhar, DR Rajasekhar Latest Movie news, Rajasekhar signs an emotional thriller, Rajasekhar To Do Interesting Projet, Telugu Film updates, Telugu
షూటింగ్ అప్‌డేట్

సింగిల్ షెడ్యూల్ లో థ్రిల్లర్ మూవీ

కల్కి మూవీ తరువాత డాక్టర్ రాజశేఖర్ ఒక ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ &డిస్ట్రిబ్యూటర్స్ అధినేత, ఫిల్మ్ క్రిటిక్ ధనుంజయన్ నిర్మాతగా, తమిళ మూవీ సైతాన్ (భేతాళుడు ) వంటి బ్లాక్ బస్టర్ మూవీ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ఈ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్

షేర్