తానే ఒక సందోహం.. తన జీవితమొక సందేశం..!

2019 Latest Telugu Film News, Pawan Kalyan Emotional Birthday Wishes to Chiranjeevi, Megastar Chiranjeevi Birthday Celebrations, Pawan Kalyan Special Birthday Wishes To Chiranjeevi, Chiranjeevi Received Wishes From Pawan Kalyan, Pawan Kalyan Latest Movie News, Happy Birthday Mega Star Chiranjeevi, Megastar Chiranjeevi Birthday Special Wishes, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

తెలుగు సినీ పుస్తకంలో ఎందరో స్టార్ సూపర్ స్టార్ల పేర్లు లిఖించబడ్డాయి. తమ స్వకష్టంతో పైకి వచ్చి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచేది మాత్రం కొంతమందే. అలాంటి వాళ్ళ పేర్లు మాత్రం మనుషుల గుండెల్లో రాయబడతాయి. అలా ఎంతోమంది గుండెల్లో అభిమాన హీరోగా నిలిచిపోయిన ఓ ‘స్వయంకృషి’, ఓ ‘ఆపద్భాందవుడు’ కొణిదల ‘కొదమసింహం’ శివశంకర వరప్రసాద్. అదే మన సూపర్ స్టార్ చిరంజీవి.

తన సినీ జీవితంలో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు అందించారు. అంతే కాదు బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరిగిరాశాయి తన సినిమాలు. తన నటనతో, కామెడీ తో, డాన్స్ లతో ఫ్యాన్స్ ను కేరింతలు కొట్టించేవారు. దాదాపు నాలుగు ద‌శాబ్దాల పాటు తెలుగు చ‌ల‌న‌చిత్ర రంగాన్ని ఏలిన చిరంజీవి స్థానంలో మరే హీరో రాలేదంటేనే అర్ధమవుతుంది ఆయన నటనాపటిమ. కొద్దికాలం సినిమాలకు దూరంగా వున్నా.. 2017లో మ‌రోసారి ముఖానికి మేక‌ప్ వేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఖైదీ నెంబ‌ర్ 150(త‌న 150 వ చిత్రం) తీశారు. ఇది సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది. ప్రస్తుతం సైరా సినిమాతో బిజీ గా వున్నారు. త్వరలోనే ఆ సినిమాను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక రేపు 64 వసంతం లోకి అడుగుపెడుతున్న చిరు ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని.. ఇలానే మ‌రిన్ని సంవ‌త్స‌రాలు ఆయ‌న న‌ట‌న‌తో ప్ర‌జ‌ల‌కు ఆనందం పంచాల‌ని కోరుకుందాం!

ఇక రేపు పుట్టిన రోజు సందర్భంగా తన అడుగుజాడల్లోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ .. తన అన్న, గురువు అన్నీ తనలో చూసుకునే చిరంజీవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ విడుదల చేశారు. అదేంటో మీరు కూడా చూడండి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here