అవన్నీ రూమర్లే అన్నమాట..!

2019 Latest Telugu Film News, Rumors on Vijay Sethupathi Opting Out from Vaishnav Tej Movie, Rumors on Vijay Sethupathi, Vaishnav Tej Movie, All The Rumors On Uppena End With Vijay Sethupathi Words, Vijay Sethupathi Comments on Rumors, Vijay Sethupathi Latest Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

మెగా కాంపౌండ్ నుండి టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు దర్శకత్వం లో ఉప్పెన అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. విజయ్ సేతుపతి తప్పుకుంటున్నట్లు రూమర్లు వినిపించాయి. ఈ రూమర్లపై చిత్ర బృందం నుంచి ఎవ్వరూ ఖండించకపోవడంతో అది నిజమే అనుకున్నారంతా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కానీ ఇప్పుడు అవన్నీ ఒట్టి పుకారులేనని తేలిపోయింది. ఈ సినిమా షూటింగ్ లో విజయ్ సేతుపతి పాల్గొంటున్నాడు. ఈ విషయాన్నీ ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు స్వయంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవ్ తేజ్ సరసన తమిళ నటి కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి.

న‌టీన‌టులు: వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి, విజ‌య్ సేతుప‌తి త‌దిత‌రులు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సాన‌
బ్యాన‌ర్స్‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్ర‌ఫీ:శ‌్యామ్ ద‌త్ సైనుద్దీన్‌
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: మోనిక రామ‌కృష్ణ‌

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 20 =