
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 15


థాయ్‌లాండ్‌లో బాలయ్య పోరాటాలు

కాజల్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్

కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ ప్రారంభం

రెజీనా ఫస్ట్ టైమ్ సొంత వాయిస్

రజనీకాంత్ 44 ఇయర్స్ సినీ కెరీర్

ఆగస్టు 2019... కేరాఫ్ రీమేక్ మూవీస్

తమ్ముడి సినిమాకు నిర్మాతగా అన్న..?

ఎవరు మూవీ పై ప్రశంసలు

ఆ వార్తల్లో నిజం లేదు: చిరు

‘మహానటి’ దర్శకుడితో మరోసారి విజయ్ దేవరకొండ?

‘భాగమతి’ దర్శకుడితో తమన్నా మూవీ?

రెండు వారాలు విశ్రాంతి తీసుకోనున్న ‘వెంకీమామ’

ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బన్నీ, సుక్కు మూవీ?

మహేష్ బాబు ‘అర్జున్’కు 15 ఏళ్ళు

ప్రతీ భారతీయుడు గర్వపడే మూవీ "మైదాన్ " - కీర్తి సురేష్
లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ మహానటి లో సావిత్రి క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకొన్న కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే బాలీవుడ్ మూవీ మైదాన్ 19 వ తేదీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ బదాయి హో దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్, కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా మైదాన్ మూవీ ప్రముఖ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.

మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ‘ఇస్మార్ట్’ హీరోయిన్!?
‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నభా నటేష్. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’లో వరంగల్ చాందినిగా కుర్రకారుని ఫిదా చేసిన ఈ కన్నడ కస్తూరి... ఇప్పుడిప్పుడే తెలుగు నాట వరుస సినిమాలతో బిజీగా మారుతోంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘డిస్కోరాజా’లో ఒక నాయికగా నటిస్తున్న నభా... తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్.

థాయ్‌లాండ్‌లో బాలయ్య పోరాటాలు
`జై సింహా` తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో మరో యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక నాయికలుగా నటిస్తుండగా... భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా...ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గానూ, గ్యాంగ్స్టర్గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాలయ్య కనిపించనున్నట్టు సమాచారం.

`ఎఫ్ 2` తరువాత మరోసారి మెహరీన్ సంక్రాంతి సందడి
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2` చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది మెహరీన్. కట్ చేస్తే... అదే సీజన్లో మరో సినిమాతో కనువిందు చేసేందుకు సిద్ధమవుతోందీ పంజాబీ జాబిలి.

కాజల్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్
తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని మూటగట్టుకున్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్... తాజాగా మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పంద్రాగస్టున విడుదలైన ఆ చిత్రమే `కోమాలి`. `జయం` రవి కథానాయకుడిగా నటించిన ఈ తమిళ సినిమాలో కాజల్ గ్లామర్ రోల్లో సందడి చేసింది.

వారం రోజుల గ్యాప్‌లో రానున్న కోలీవుడ్ బ్రదర్స్
తమిళంతో పాటు తెలుగులోనూ తమకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్నారు కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తి. ఇదిలా ఉంటే... ఈ అన్నదమ్ములిద్దరూ వారం రోజుల గ్యాప్‌లో తమ కొత్త చిత్రాలతో పలకరించడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు... ఈ రెండు తమిళ సినిమాలు తెలుగులోనూ అనువాద రూపంలో విడుదల కానుండడం విశేషం.

కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ ప్రారంభం
తమిళ, తెలుగు మూవీస్ తో బిజీగా ఉన్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ ఈరోజు ప్రారంభమయింది. బోనీకపూర్ నిర్మాతగా, బ్లాక్ బస్టర్ మూవీ బదాయి హో దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్, కీర్తి సురేష్ జంటగా రూపొందనున్న మైదాన్ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫుట్ బాల్ కోచ్ , మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా మైదాన్ మూవీ రూపొందుతుంది.

రెజీనా ఫస్ట్ టైమ్ సొంత వాయిస్
వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. రెజీనా పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. తమిళ చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకొనే రెజీనా నటించిన శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జో అచ్యుతానంద, అ ! మూవీస్ కు డబ్బింగ్ ఆర్టిస్ట్ లే డబ్బింగ్ చెప్పారు. ఎవరు మూవీ లో రెజీనా తన పాత్ర కు ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పుకొన్నారు.

రజనీకాంత్ 44 ఇయర్స్ సినీ కెరీర్
తమిళ సూపర్ స్టార్ నిన్నటితో 44 సంవత్సరాల సినీ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నారు. అపూర్వ రాగంగళ్ తమిళ మూవీ తో రజనీకాంత్ కోలీవుడ్ కు పరిచయమయ్యారు. ఆమూవీ 1975 సంవత్సరం ఆగస్ట్ 18 వ తేదీ రిలీజయి కమర్షియల్ గా విజయం సాధించింది. సూపర్ హిట్ మూవీ అంతులేని కథ(1976) తో టాలీవుడ్ కు ఎంటరయ్యారు. యాక్టింగ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఏర్పరుచుకున్న రజనీకాంత్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్నారు. అభిమానులచే తలైవా అని పిలిపించుకొనే రజనీకాంత్ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల చిత్రాలలో నటించారు. ఇంగ్లీష్ భాషా చిత్రం బ్లడ్ స్టోన్ లో నటించడం విశేషం.

ఆగస్టు 2019... కేరాఫ్ రీమేక్ మూవీస్
ఒక భాషలో విజయం సాధించిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం కొత్త వ్యవహారమేమీ కాదు. అయితే... ఒకే నెలలో వరుసగా నాలుగు వారాల పాటు వారానికో రీమేక్ చిత్రం విడుదల కావడం కచ్చితంగా వార్తల్లో నిలచే అంశమే. అలా... తెలుగునాట 2019 ఆగస్టు... రీమేక్ మూవీస్‌తో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యింది.

సాహో మూవీ లో స్పెషల్ సాంగ్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సాహో మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. జాక్విలిన్ హీరోయిన్ గా నటించిన హిందీ మూవీస్ మర్డర్ 2, హౌస్ ఫుల్ 2, రేస్2 , కిక్, హౌస్ ఫుల్3, జు డ్వా 2, రేస్ 3 ఘనవిజయం సాధించాయి.

తమ్ముడి సినిమాకు నిర్మాతగా అన్న..?
తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే టాప్ హీరో రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ. రౌడీ హీరో అని యూత్ ముద్దుగా పిలుచుకునే ఈ హీరో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రొడక్షన్ కూడా స్టార్ చేసాడు. ఇప్పటికే తనకు పెళ్లి చూపులు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. అదేంటంటే.. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో విజయ్ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎవరు మూవీ పై ప్రశంసలు
అడివి శేష్, రెజీనా జంటగా వెంకట్ రామ్ జీ దర్శకత్వం లో PVP బ్యానర్ పై రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజయి పాజిటివ్ టాక్ తో, రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్న ఎవరు మూవీ అంచనాలకు తగ్గట్టుగానే విజయం సాధించి ప్రేక్షకాదరణ పొందింది. అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర అద్భుతం గా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

ఆ వార్తల్లో నిజం లేదు: చిరు
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ప్రారంభం కానున్న ఈ సినిమా... 2020 ఉగాదికి రిలీజ్ కానుందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి.

‘మహానటి’ దర్శకుడితో మరోసారి విజయ్ దేవరకొండ?
`ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ చిత్రాలతో అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు నాగ్ అశ్విన్. కాగా...`మహానటి` తరువాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్... ఇప్పుడు తన మూడో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడట. `ఎవడే సుబ్రహ్మణ్యం`, `మహానటి` చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ఇందులో కథానాయకుడిగా నటిస్తాడని సమాచారం. ఇప్పటికే ఈ మేరకు విజయ్, అశ్విన్ మధ్య చర్చలు జరిగాయని టాక్. అంతేకాదు... ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా `ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ చిత్రాలను నిర్మించిన స్వప్న సినిమా సంస్థ నిర్మించనుందని తెలుస్తోంది…

‘భాగమతి’ దర్శకుడితో తమన్నా మూవీ?
ఒక వైపు గ్లామర్ రోల్స్ తో కనువిందు చేస్తూనే... మరోవైపు అభినయానికి అవకాశమున్న పాత్రల్లోనూ అలరిస్తోంది తమన్నా. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... తాజాగా ఓ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే... గత ఏడాది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘భాగమతి’తో ఆకట్టుకున్న దర్శకుడు అశోక్... తాజాగా మరో విమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్ రెడీ చేసాడట. ఈ నేపథ్యంలో... తమన్నాకు ఈ కథను నేరేట్ చేయడం... కథ నచ్చడంతో తమన్నా కూడా అంగీకారం తెలిపడం జరిగిందని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే…

రెండు వారాలు విశ్రాంతి తీసుకోనున్న ‘వెంకీమామ’
అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, యువ కథానాయకుడు నాగ చైతన్య కాంబినేషన్లో ‘వెంకీమామ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే... రామోజీ ఫిల్మ్ సిటీలో పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో... వెంకీ స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. కొన్ని డ్యాన్స్ మూవ్స్ చేస్తుండగా వెంకటేష్ కాలు బెణికిందట. అయితే... గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారట. దాంతో వెంకీ పూర్తిగా కోలుకున్న తరువాతే ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని సన్నిహిత వర్గాలు…

ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బన్నీ, సుక్కు మూవీ?
`ఆర్య`, `ఆర్య 2` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బన్నీకి జోడీగా రష్మిక మందన నటించనుంది. కాగా... ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రం ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే, రెగ్యులర్ షూటింగ్ మాత్రం నవంబర్ నుంచి మొదలవుతుందని టాక్. త్వరలోనే బన్నీ-సుక్కు మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు…

బాలయ్య, పూరి కాంబినేషన్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
కథానాయకులను కొత్తగా ప్రెజెంట్ చేయడంలో ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీరే వేరు. తొలి చిత్రం `బద్రి` నుంచి తాజా చిత్రం `ఇస్మార్ట్ శంకర్` వరకు ఇదే శైలిని కొనసాగించాడు పూరి. ఇదిలా ఉంటే... తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో చేయనున్న పూరి... ఆ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణతో సినిమా చేయనున్నాడని టాక్. `పైసా వసూల్` సమయంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందని వార్తలు వచ్చాయి. అయితే... దాదాపు రెండేళ్ళ తరువాత అది కార్యరూపం దాల్చనుందని టాక్.

మహేష్ బాబు ‘అర్జున్’కు 15 ఏళ్ళు
తెలుగునాట బ్రదర్ - సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో పలు చిత్రాలు రూపొందాయి. అయితే, కవలలైన అక్క - తమ్ముడు కథలతో సినిమాలు తెరకెక్కడం అరుదనే చెప్పాలి. అలాంటి చిత్రమే... ‘అర్జున్’. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ ఎమోషనల్ డ్రామాను టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించాడు. ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్, గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో మహేష్‌కి కవల సోదరిగా కీర్తి రెడ్డి నటించగా... శ్రియ కథానాయికగా నటించింది. రాజా, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. సుదీర్ఘ విరామం అనంతరం సీనియర్ యాక్ట్రస్…