చిరంజీవి ‘చంటబ్బాయ్’కు 33 ఏళ్ళు

2019 Latest Telugu Film News, Chiranjeevi Chantabbai Completes 33 Years, Chiranjeevi Chantabbai Telugu Movie,33 Years For Chantabbai Movie, 33 Glorified Years For Chantabbai, Chantabbai Movie Latest News, Chantabbai Movie Clocks 33 Years, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News, Chiranjeevi Chantabbai Completes 33 Years

మెగాస్టార్ చిరంజీవి… ఈ పేరు చెబితే ఎవ‌రికైనా ముందుగా గుర్తొచ్చేది ముచ్చ‌ట‌గొలిపే హావ‌భావాలు, క‌నువిందైన నృత్య విన్యాసాలు. తన నర్తనంతో, నటనతో, ఫైట్స్‌తో తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన చిరు… కామెడీ పండించడంలోనూ సిద్ధహస్తుడే. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో పలు హాస్యభరిత చిత్రాలలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు చిరు. అటువంటి చిత్రాలలో ముందువరుసలో ఉండే క్లాసిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘చంటబ్బాయ్’. చిరంజీవిలోని హాస్యచతురతతో పాటు కామెడీ టైమింగ్‌ను కూడా నూటికి నూరు పాళ్ళు వాడుకున్నారు చిత్ర దర్శకుడు, “హాస్య బ్రహ్మ” జంధ్యాల. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన `చంట‌బ్బాయ్‌` నవలాధారంగా అదే పేరుతో రూపొందిన ఈ సినిమాలో సుహాసిని కథానాయికగా నటించగా… జగ్గయ్య, ముచ్చర్ల అరుణ, సుత్తివేలు, సుత్తి వీరభ‌ద్ర‌రావు, అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, చంద్రమోహన్, శ్రీలక్ష్మి, సుధాకర్, పొట్టి ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య‌ భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన గీతాలకు… చక్రవర్తి స్వరకల్పన చేసారు. “అట్లాంటి ఇట్లాంటి”, “నేను ప్రేమ పూజారి” వంటి పాటలు సినిమా కథకు తగ్గట్టుగానే కామెడీ నేపథ్యంలో సాగుతాయి. ఈ గీతాల్లో చిరు గెట‌ప్పులు కూడా భ‌లేగా అల‌రిస్తాయి. జ్యోతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం… చిరంజీవి కెరీర్‌లోనే ది బెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ అనిపించుకోవ‌డ‌మే కాకుండా… చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఏకైక చిత్రంగానూ నిలచిపోయింది. 1986 ఆగస్టు 22న విడుదలైన ‘చంటబ్బాయ్’… నేటితో 33 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − six =