స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న 19వ చిత్రం ‘అల… వైకుంఠపురములో…’. ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో… బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. టబు, జయరామ్, రాజేంద్రప్రసాద్, సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఇటీవల కాకినాడ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం… గురువారం నుంచి కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకోనుందని సమాచారం. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ భారీ హౌస్ సెట్‌ను తీర్చిదిద్దినట్టు టాక్. దాదాపు రూ.4.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ఇంటిలో… సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలన్నీ తెరకెక్కించనున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘అల… వైకుంఠపురములో…’ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: