‘హవా’ రిలీజ్ డేట్ ఖరారు

2019 Latest Telugu Film News, Hawaa Movie, Hawaa Movie Latest News, Hawaa Movie Release Date, Hawaa Movie Release Date Fixed, Hawaa Movie Release Date Out, Hawaa Movie Release updates, Hawaa Movie romantic crime thriller, Hawaa Movie Will Hit The Theatres On This Day, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News

ప్రస్తుతం థ్రిల్లర్ మూవీస్ కే మార్కెట్ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేక్షకులు థ్రిల్లింగ్ నే ఎక్కువ కోరుకుంటున్నారు. సినిమాలో ఎన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే సినిమా అంత హిట్ అయినట్టు లెక్క. అందుకే మేకర్స్ కూడా ఇలాంటి సినిమాలు తీయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక తాజాగా వచ్చిన మంచి హిట్ కొట్టిన రాక్షసుడు, ఎవరు ఈ ట్రెండ్ ను రుజువు చేశాయి. ఇప్పుడు అదే బాటలో మరో వినూత్న కథనంతో వస్తున్న సినిమా ‘హవా’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేశ్‌ రెడ్డి దర్శకత్వంలో చైతన్య మాదాడి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘హవా’. 9 గంటలు, 9 బ్రెయిన్స్, 9 నేరాలు అనేది ట్యాగ్‌లైన్‌. మోషన్ టీజర్ నుంచే మోస్ట్ ఇన్నోవేటివ్ గా చూపించారు ఈ సినిమాను. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఆగష్ట్ 23వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఫిల్మ్‌ అండ్‌ రీల్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య కు జోడీగా దివి ప్రసన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని పూర్తిగా ఆస్ట్రేలియాలో తెరకెక్కించారు. సినిమా అంతా 9 గంటల్లో జరిగే స్టోరీ కావటం… సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. అంతేకాదు రేసీగా సాగే స్క్రీన్‌ప్లే సినిమాకు మేజర్ హైలెట్ అవుతుందని, తెలుగులో ఇప్పటి వరకూ ఇలాంటి కథనంతో సినిమా రాలేదని, పూర్తిగా ఆస్ట్రేలియాలోనే చిత్రీకరణ జరిపామని చిత్రయూనిట్ తెలుపుతోంది. పూర్తిగా ఆస్ట్రేలియాలోనే చిత్రీకరించిన తొలి తెలుగు సినిమాగా ఇదేనని సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంతో వున్నారు. మరి చూద్దాం ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అవుతుందో?లేదో?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 15 =