కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Cinema News 2025

ట్యాగ్ · 318 కథనాలు · పేజీ 9

Baahubali The Epic Trailer Unveiled
ట్రైలర్ & టీజర్

బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ రిలీజ్

బాహుబలి & బాహుబలి 2 భారతీయ చలన చిత్ర చరిత్రలో ఒక స్వర్ణ అక్షరంలా చెప్పుకోవచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్‌ ఇమేజ్ ను మార్చి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన ఈ విజువల్ వండర్ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా, ఇప్పుడు రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నెల 31న ఈ చిత్రం థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో, మేకర్స్ విడుదల చేసిన కొత్త ట్రైలర్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

Mahender Reddyవాట్సాప్
Hero Nara Rohith Invites CM Revanth Reddy for His Wedding
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నారా రోహిత్ .. తన పెళ్లికి ఆహ్వానించిన హీరో

టాలీవుడ్ హీరో నారా రోహిత్ వివాహం నటి శిరీష లేళ్లతో అంగరంగ వైభవంగా జరగనుంది. అక్టోబర్ 30న హైదరాబాద్‌లో వీరి పెళ్లి వేడుకకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నేపథ్యంలో వివాహ పనుల్లో బిజీగా ఉన్న రోహిత్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన పెళ్లికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Kantara Chapter 1 Left Me in a Trance Says Allu Arjun
సినిమా వార్తలు

కాంతార చాప్టర్ 1 చూస్తున్నంత సేపు ఒక ట్రాన్స్‌లో ఉండిపోయాను - అల్లు అర్జున్

దసరా రోజు విడుదలై థియేటర్లలో బ్లాక్ బస్టర్ రన్ కొనసాగిస్తున్న కన్నడ చిత్రం కాంతార చాప్టర్ 1.కాంతార ప్రీక్వెల్ గా వచ్చిన ఈసినిమా ఇప్పటికే పలు రికార్డులు సృష్టించింది.ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈసినిమాను చూసి మైమరిచిపోయారు.ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, సోషల్ మీడియా వేదికగా తన అనుభూతిని అభిమానులతో పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Nandamuri Balakrishna’s Akhanda 2 Teaser Released
ట్రైలర్ & టీజర్

అఖండ 2 టీజర్ రిలీజ్

నట సింహం బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న చిత్రం అఖండ 2.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.ఈసినిమా నుండి ఇంతకుముందు గ్లింప్స్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Lokah Chapter-1 to Stream on JioHotstar from October 31st
ఓటీటీ

7 భాషల్లో ఓటీటీ లోకి రానున్న కొత్త లోక

మలయాళ ఇండస్ట్రీ హిట్ లోక: చాప్టర్ 1 -చంద్ర సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు చివర్లో థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలై అద్భుతమైన మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా చరిత్ర సృష్టించింది.ఇక ఈ సినిమా అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Peddhi Gears Up for Its Next Shooting Schedule
షూటింగ్ అప్‌డేట్

పెద్ది నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు సాన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. ఇక రీసెంట్ గా పూణే షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా నెక్స్ట్ షెడ్యూల్ శ్రీలంక లో జరుగనుంది. దాదాపు వారం రోజులపాటు ఈ షెడ్యూల్ జరుగనుంది. ఇందుకోసం రామ్ చరణ్ ,బుచ్చి బాబు, ఈరోజు శ్రీలంక బయల్దేరి వెళ్లారు.

Mahender Reddyవాట్సాప్
Kantara Chapter 1 Becomes the Year’s Highest Grosser
సినిమా వార్తలు

హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించిన కాంతార చాప్టర్ 1

రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది.విడుదలై నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతూ రికార్డు లను క్రియేట్ చేస్తుంది. ఇక ఈసినిమా మరో రికార్డు ను ఖాతాలో వేసుకుంది. నిన్నటి తో 818 కోట్ల వసూళ్లను సొంతం చేసుకోవడంతో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు హిందీ మూవీ ఛావా పేరు మీద ఉండేది.

Mahender Reddyవాట్సాప్
Idli Kadai OTT Release Date Locked
ఓటీటీ

ఇడ్లీ కడై ఓటీటీ విడుదల తేదీ ఖరారు

కుబేర తరువాత తమిళ హీరో ధనుష్ నెక్స్ట్ ఇడ్లీ కడై తో ప్రేక్షుకులముందుకు వచ్చాడు.అక్టోబర్ 1 న విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనిపించుకుంది.అదే టైంలో కాంతార చాప్టర్ 1 కూడా విడుదలకావడంతో ఇడ్లీ కడై అనుకున్న వసూళ్లను సాధించలేకపోయింది. ఈసినిమా తెలుగులో శ్రీ ఇడ్లీ కొట్టు గా విడుదలైంది .శ్రీ వేదాక్షర మూవీస్ అనే సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేసింది.

Mahender Reddyవాట్సాప్
Spirit Audio Glimpse Released
ట్రైలర్ & టీజర్

స్పిరిట్ ఆడియో గ్లింప్స్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది స్పిరిట్ టీం.ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (యానిమల్, అర్జున్ రెడ్డి ఫేమ్) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'స్పిరిట్' నుంచి మేకర్స్ ఒక ప్రత్యేకమైన ఆడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకముందే, ఈ 'సౌండ్ స్టోరీ'తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. సాధారణంగా ఫస్ట్ లుక్ లేదా టీజర్‌ను విడుదల చేసే ట్రెండ్‌కు భిన్నంగా, సందీప్ రెడ్డి వంగ ఒక డిఫరెంట్ అప్‌డేట్‌ను ఎంచుకున్నారు.సుమారు 91 సెకన్ల నిడివి ఉన్న ఈ ఆడియో గ్లింప్స్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
Ram Charan–Upasana to Become Parents Again
సినిమా వార్తలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్, ఉపాసన

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్, ఉపాసనరామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల వారి జీవితంలో మరో అందమైన అధ్యాయాన్ని ఆరంభించారు. ఈ జంట రెండోసారి తల్లిదండ్రులు కానున్నారు. త్వరలో ట్విన్స్‌కు (కవలలు) జన్మనివ్వనున్నారు. ఒక క్యూట్‌ వీడియోను పోస్ట్‌ చేసిన ఉపాసన.. ఈ దీపావళి మా జీవితంలో డబుల్ సెలబ్రేషన్, డబుల్ లవ్, డబుల్ బ్లెసింగ్స్‌తో ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఈ గుడ్‌న్యూస్‌ను షేర్‌ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Venkatesh Joins the Shoot of Mana Shankara Vara Prasad Garu
షూటింగ్ అప్‌డేట్

మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్ లో వెంకటేష్ జాయిన్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌ కలగలిపిన ఈ సినిమా పండగ సీజన్‌కు పర్ఫెక్ట్ ట్రీట్. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
The Girlfriend Trailer Date Fixed
ట్రైలర్ & టీజర్

ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ యాక్షన్-కామెడీ చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈసినిమా ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది.థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల అక్టోబర్ 25న విడుదల చేయబోతున్నారు.

Mahender Reddyవాట్సాప్
Dude Enters the 100 Crore Club
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లో డ్యూడ్

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ నిన్నటి తో 100కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఈనెల 17న విడుదలైన ఈసినిమా పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.కేవలం 6 రోజుల్లోనే ఈసినిమా 100కోట్ల మార్క్ చేరుకుంది. ప్రదీప్ కి ఇది మూడో 100కోట్ల సినిమా. దాంతో మొదటి మూడు సినిమాలతో ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ హీరోగా ప్రదీప్ రికార్డు సృష్టించాడు. ఈ వీకెండ్ కల్లా డ్యూడ్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Prabhas Birthday Special The Journey of a Pan-India Icon
బర్త్‌డే స్పెషల్స్

ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్

ప్రతి సంవత్సరం అక్టోబరు 23వ తేదీ సినీ అభిమానులకు ఒక పండుగ. ఎందుకంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన ఈ 'డార్లింగ్' హీరో ప్రయాణం ఎందరికో ఆదర్శం.

Mahender Reddyవాట్సాప్
FAUZI Announced as the Title of Prabhas–Hanu Film
ఫస్ట్ లుక్

ప్రభాస్ హను టైటిల్ పోస్టర్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్- డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈరోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈసినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను ఖరారు చేశారు.సినిమా అనౌన్స్ మెంట్ నుండే ఈ టైటిల్ ప్రచారంలో ఉండగా మేకర్స్ కూడా అదే ఫైనల్ చేశారు. బ్రిటీష్ పాలనకు ఎదురెళ్ళిన ఓ సైనికుడి కథతో వస్తుంది ఫౌజీ.ఇందులో ప్రభాస్ టైటిల్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రభాస్ ప్రీ లుక్ తో కూడిన ఈ టైటిల్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

Mahender Reddyవాట్సాప్
OG Streaming Now on Digital Platform
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి ఓజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా ఓజీ. గత నెల 25న థియేటర్లలో విడుదలైన ఈసినిమా ఫుల్ రన్ లో 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. పవన్ ఈసినిమాతో కం బ్యాక్ ఇవ్వడమే కాదు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇందులో పవన్ ను నెక్స్ట్ లెవెల్లో చూపించాడు సుజీత్ ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల్లో ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. మరి థియేటర్లలో అదరగొట్టిన ఈసినిమా ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
Ammadive Lyrical Video from Kaantha Out Now
సాంగ్

కాంత నుండి అమ్మడివే సాంగ్ రిలీజ్

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ బైలింగ్వల్ పీరియాడికల్ డ్రామా 'కాంత' నవంబర్ 14న రిలీజ్ కానుంది. 1950 మద్రాస్, సినిమా గోల్డెన్ ఏజ్ బ్యాక్ డ్రాప్ రూపొందుతున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాంత అద్భుతమైన ప్రేమకథతో పాటు మూవీ వరల్డ్ కి ట్రిబ్యూట్ గా తెరకెక్కుతుంది.

Mahender Reddyవాట్సాప్
Venkatesh Joins the Shoot of Mana Shankara vara Prasad Garu
షూటింగ్ అప్‌డేట్

మన శంకరవరప్రసాద్ షూటింగ్ లో వెంకటేష్ జాయిన్

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్ గారు. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరగనుంది. ఇక ఈషెడ్యూల్ లో వెంకటేష్ జాయిన్ అయ్యారు.నిన్నటి నుండి వెంకీ ఈసినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇందులో తను క్యామియో రోల్ లో కనిపించనున్నాడని తెలిసిందే. చిరంజీవి ,వెంకటేష్ కలిసి నటించడం ఇదే మొదటి సారి కానుంది.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi’s Grand Diwali Bash Attended By Venkatesh and Nagarjuna
సినిమా వార్తలు

మెగాస్టార్ ఇంట్లో దీపావళి సంబరాలు.. హాజరైన వెంకటేష్, నాగార్జున

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ఆయన స్నేహితులు విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, కింగ్ నాగార్జున అక్కినేని హాజరయ్యారు. వెంకటేష్ భార్య నీరజ, నాగార్జున భార్య అమల కూడా ఈ ప్రత్యేక వేడుకలో పాల్గొన్నారు. అలాగే చిరంజీవి నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలోని హీరోయిన్ నయనతార కూడా ఈ వేడుకకు విచ్చేసి సందడి చేశారు.

Srikanth Mవాట్సాప్
Vishnu Vishal's Aaryan Trailer Receiving Amazing Response
ట్రైలర్ & టీజర్

ఆర్యన్ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్

కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ మరియు ఫస్ట్ సింగిల్‌కి మంచి స్పందన వచ్చిన తర్వాత, తాజాగా మేకర్స్ నెయిల్-బైటింగ్ ట్రైలర్‌ని విడుదల చేశారు.

Srikanth Mవాట్సాప్

షేర్