మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ఆయన స్నేహితులు విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, కింగ్ నాగార్జున అక్కినేని హాజరయ్యారు. వెంకటేష్ భార్య నీరజ, నాగార్జున భార్య అమల కూడా ఈ ప్రత్యేక వేడుకలో పాల్గొన్నారు. అలాగే చిరంజీవి నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలోని హీరోయిన్ నయనతార కూడా ఈ వేడుకకు విచ్చేసి సందడి చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ముగ్గురు ఐకానిక్ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. కాలం మారినా, తరాలు మారినా, వీరి స్నేహం మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందనే భావనను ఈ వేడుక మరోసారి గుర్తుచేసింది. చిరంజీవి నివాసం పండుగ శోభతో మెరిసిపోయింది. మెగా కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొని ఆనందాన్ని రెట్టింపు చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి తన ఎక్స్ (X) అకౌంట్‌లో.. “నా డియర్ ఫ్రెండ్స్ నాగార్జున, వెంకటేష్, నా సహనటి నయనతారతో కలిసి దీపావళిని ఎంతో ఆనందంగా జరుపుకున్నాను. ఇలాంటి క్షణాలే మన హృదయాలను సంతోషంతో నింపుతాయి. ప్రేమ, నవ్వులు, ఐక్యత..ఇవే జీవితం నిజంగా వెలుగొందే మూలాలు.” అని పోస్ట్ చేశారు.
ఇక చిరంజీవి పంచుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ముగ్గురు ఐకానిక్ స్టార్స్ కలిసి ఒకేచోట కనిపించడం చూసిన వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























