బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ రిలీజ్

Baahubali The Epic Trailer Unveiled

బాహుబలి & బాహుబలి 2  భారతీయ చలన చిత్ర చరిత్రలో ఒక స్వర్ణ అక్షరంలా చెప్పుకోవచ్చు.  రెబల్ స్టార్ ప్రభాస్‌ ఇమేజ్ ను మార్చి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన ఈ విజువల్ వండర్ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా, ఇప్పుడు రెండు భాగాలను  కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ప్రేక్షకుల  ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నెల 31న ఈ చిత్రం థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో, మేకర్స్ విడుదల చేసిన కొత్త ట్రైలర్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజమౌళి సృష్టించినమాహిష్మతి సామ్రాజ్యం, అమరేంద్ర బాహుబలి, భళ్లాలదేవుడి మధ్య సింహాసనం కోసం జరిగిన యుద్దం, కథలో కీలకమైన మలుపులు, పవర్‌ఫుల్ డైలాగులు అన్నీ ఈ ట్రైలర్‌లో కవర్ అయ్యాయి. “ఇద్దరు సోదరులు… ఓ సింహాసనం… ఇద్దరు మహిళలు… ఒక యుద్ధం…” అంటూ సాగే కథా పరిచయం, ప్రేక్షకులను ఆసక్తిని రెట్టింపు చేసింది.’బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాల నుంచి ముఖ్యమైన, ఉద్వేగభరితమైన సన్నివేశాలను ఎంపిక చేసి, ఈ కొత్త ట్రైలర్‌ను తీర్చిదిద్దారు. ‘నేను రాజైతే నువ్వే నా సేనాధిపతివి’, ‘వచ్చే విజయదశమికి అదే ముహూర్తంలో భళ్లాల దేవుడికిి మహారాజ పట్టాభిషేకం’ వంటి డైలాగ్స్ మళ్లీ వింటుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. పదేళ్ల తర్వాత కూడా ఈ చిత్రం కల్పించే అనుభూతి అద్భుతంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.  


బాహుబలి ది ఎపిక్  2 గంటల 44 నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది. సాంగ్స్ దాదాపు లేనట్లే. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. రీ రిలీజ్ సినిమాల్లోనే బాహుబలి ది ఎపిక్ కలెక్షన్ల పరంగా  ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా  రికార్డు సృష్టించనుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.