ట్యాగ్ · 343 కథనాలు · పేజీ 3
"లక్ష్మీ బాంబ్ " మూవీ విలన్

ఆగస్టులో మరో రెండు చిత్రాలతో బేబీ సందడి
ఫైనల్లీ ముగిసిన ఆదిత్యవర్మ
ఇప్పటికీ ఆ మైకంలోనే ఉన్నా

కమల్ హాసన్, AR రెహమాన్ కాంబినేషన్ మూవీ

రీమేక్‌లో నటిస్తున్న శ్రియ
'ప్రతిరోజు పండగే' సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

గుణ 369 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్
బాలీవుడ్ టాప్ 10లో తెలుగు దర్శకుల హవా

అస్సలు తగ్గని మన్మథుడు 2

గోపీచంద్ ‘చాణక్య’ మూవీ అప్‌డేట్

రవితేజకి జోడీగా అదితి రావ్ హైదరీ?

స్పెయిన్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న కీర్తి సురేష్ చిత్రం

తుది దశకు చేరుకున్న ‘వెంకీమామ’

‘కేరాఫ్ కంచెర పాలెం’ కు మరో ఘనత
సందీప్ కు తాప్సీ ఇన్ డైరెక్ట్ కౌంటర్
అర్జున్ రెడ్డి సినిమాను హిందీ కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా మంచి సూపర్ హిట్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగా. కలెక్షన్ల పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఎంట్రీ బాగానే ఉంది.. సందీప్ కు ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి అనుకుంటుండగా.. ఈమధ్య కబీర్ సింగ్ సినిమాలోని ఓ సన్నివేశంపై పెద్ద వివాదమే రేగడంతో సందీప్ స్లో అయ్యాడు.
"లక్ష్మీ బాంబ్ " మూవీ విలన్
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమిళ భాషలో రూపొందిన హారర్ కామెడీ మూవీ ముని 2, తెలుగు డబ్బింగ్ వెర్షన్ కాంచన మూవీస్ ఘనవిజయం సాధించాయి. కాంచన మూవీ హిందీ భాషలో రీమేక్ అవుతుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న లక్ష్మీ బాంబ్ మూవీ 2020 సంవత్సరం జూన్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. కియారా అద్వానీ కథానాయిక.
మారుతి డైరెక్షన్ లో తాత మనవళ్లు గా సత్యరాజ్, సాయి తేజ్
`సుప్రీమ్` వంటి విజయవంతమైన చిత్రం తరువాత సాయితేజ్, రాశీ ఖన్నా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా `ప్రతీ రోజు పండగే`. యూత్‌ఫుల్ చిత్రాల స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఇటీవలే పట్టాలెక్కిన ఈ సినిమా... ఇప్పటికే తొలి షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. కాగా, రెండో షెడ్యూల్ ఈ రోజు (మంగళవారం) నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో సీనియర్ యాక్టర్ సత్యరాజ్ కూడా జాయిన్ కానున్నాడని సమాచారం. కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయితేజ్‌కి తాతయ్య పాత్రలో సత్యరాజ్…

ఆగస్టులో మరో రెండు చిత్రాలతో బేబీ సందడి
విలక్షణ పాత్రలకు చిరునామాగా నిలచిన నటి లక్ష్మి. కథానాయికగానే కాదు గుణచిత్ర నటి (క్యారెక్టర్ ఆర్టిస్ట్)గానూ తనదైన ముద్ర వేసింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రాణించిన లక్ష్మి... స్వల్ప విరామం తరువాత `ఓ బేబీ`తో టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ రోల్‌లో తన మార్క్ నటనతో మరోమారు మెప్పించింది. అంతేకాదు, వచ్చే నెలలో రానున్న మరో రెండు ఆసక్తికరమైన చిత్రాల్లోనూ సందడి చేయనుంది లక్ష్మి. ఆ చిత్రాలే `మన్మథుడు 2`, `గ్యాంగ్ లీడర్`. ఆగస్టు 9న విడుదల కానున్న `మన్మథుడు 2`లో కింగ్ నాగార్జునకి అమ్మగా కనిపించనున్న…
ఫైనల్లీ ముగిసిన ఆదిత్యవర్మ
విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక హిందీ లో కూడా ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. తమిళ్ లో కూాడా ఈ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వం వహించారు. అయితే అనుకున్న అవుట్ పుట్ ఇవ్వని నేపథ్యంలో సినిమాను మళ్లీ రీషూట్ చేశారు. తెలుగు అర్జున్ రెడ్డి మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గిరీశాయ దర్శకత్వం లో రీ షూట్ స్టార్ట్ చేశారు. ఇక అన్ని…
ఇప్పటికీ ఆ మైకంలోనే ఉన్నా
ఒక పక్క కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటే మరోపక్క వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడియన్స్ ను మొన్నటి వరకూ ఎంటర్ టైన్ చేశాయి. మొన్నటితో వరల్డ్ కప్ మ్యాచ్ ముగిసిపోయింది. కానీ ఆమ్యాచ్ ఇచ్చిన కిక్ ను మాత్రం ఇంతవరకూ మరిచిపోలేకపోతున్నారు చాలా మంది. ఇప్పటివరకూ జరిగిన ప్రపంచ కప్ చరిత్రలో.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం ప్రత్యేకం. గతంలో ఎప్పుడు ప్రపంచ కప్ మ్యాచ్ లు జరిగినా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు తడబటం.. లక్ష్య చేధనలో మరో జట్టు సునాయాసంగా గెలవడమో చూశాం కానీ.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మాత్రం రెండు జట్లూ పోటా పోటీగా పరుగులు సాధించి.. టై తో…

కమల్ హాసన్, AR రెహమాన్ కాంబినేషన్ మూవీ
లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ హీరోగా నటించిన, ఆస్కార్ అవార్డ్ గ్రహీత AR రెహమాన్ సంగీతం అందించిన తమిళ మూవీస్ ఇండియన్ (భారతీయుడు ), తెనాలి (తెనాలి ) ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు కమల్ హాసన్ దర్శకత్వంలో రూపొందే యాక్షన్ థ్రిల్లర్ మూవీ కి రెహమాన్ సంగీతం అందించనున్నారు. కమల్ హాసన్ దర్శకత్వం లో రూపొందే చిత్రానికి సంగీతం సమకూర్చడం సంతోషం గా ఉందని రెహమాన్ ట్వీట్ చేశారు.

రీమేక్‌లో నటిస్తున్న శ్రియ
పెళ్ళయ్యాక సినిమాల విషయంలో కాస్త జోరు తగ్గించిన టాలెంటెడ్ బ్యూటీ శ్రియ... మళ్ళీ ఇప్పుడిప్పుడే వాటిపై దృష్టి సారిస్తోంది. ఇటీవల ఒకట్రెండు తెలుగు చిత్రాల్లో శ్రియ పేరు ప్రముఖంగా వినిపించినా... ఆ సినిమాలకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, తాజాగా ఓ తమిళ చిత్రానికి మాత్రం ఈ సీనియర్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. `దృశ్యం` (మలయాళం) దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మలయాళ చిత్రం `మై బాస్`(2012) ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విమల్‌కి జోడీగా నటించనుంది శ్రియ. `సండక్కారి - ది బాస్` పేరుతో రూపొందనున్న ఈ సినిమాకి ఆర్.మాదేష్ దర్శకత్వం…

'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ లుక్ అప్‌డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకి ఆర్.రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. అనిల్ సుంకర, `దిల్`రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
'ప్రతిరోజు పండగే' సెకండ్ షెడ్యూల్ ప్రారంభం
మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇటీవలే 'ప్రతిరోజు పండగే' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. నేటి నుండి రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఈ షెడ్యూల్ లో సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా పాల్గొననున్నారు.

గుణ 369 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్
స్ప్రింట్ ఫిల్మ్స్ , జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణ లో అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మాణ సారథ్యం లో అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ RX 100 ఫేమ్ యూత్ ఫుల్ హీరో కార్తికేయ, అనఘ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ గుణ 369 మూవీ ఆగస్ట్ 2వ తేదీ రిలీజ్ కానుంది. సాయి కుమార్, ఆదిత్య మీనన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
బాలీవుడ్ టాప్ 10లో తెలుగు దర్శకుల హవా
హిందీనాట పలువురు తెలుగు దర్శకులు తమదైన ముద్ర వేశారు. అయితే, అక్కడి టాప్ 10 హయ్యస్ట్ గ్రాసర్స్‌లో మన టాలీవుడ్‌కి చెందిన దర్శకులు చోటు దక్కించుకోవడం అరుదనే చెప్పాలి. ఇప్పుడలాంటి రేర్ రికార్డును ఇద్దరు దర్శకులు సొంతం చేసుకున్నారు. వాళ్ళే... రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ 10 హయ్యస్ట్ గ్రాసర్స్‌లో తొలి, పది స్థానాల్లో ఈ దర్శకులు రూపొందించిన చిత్రాలు ఉండడం వార్తల్లో నిలుస్తోంది. రాజమౌళి రూపొందించిన ఎపిక్ ఎంటర్‌టైనర్ `బాహుబలి - ది కంక్లూజన్` హిందీ అనువాదం అత్యధిక వసూళ్ళతో మొదటి స్థానంలో నిలిస్తే... పదో స్థానంలో సందీప్ రెడ్డి వంగా…

అస్సలు తగ్గని మన్మథుడు 2
మన్మథుడు 2 టీమ్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటుంది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? సినిమా రిలీజ్ విషయంలో. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. షూటింగ్ చివరి దశలో ఉండగా... నాగార్జున అప్పుడే డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశాడు.

గోపీచంద్ ‘చాణక్య’ మూవీ అప్‌డేట్
గోపీచంద్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం ‘చాణక్య’. యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ స్పై ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడని సమాచారం. మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతమందిస్తున్నాడు.

రవితేజకి జోడీగా అదితి రావ్ హైదరీ?
అజయ్ భూపతి... గత ఏడాది ‘ఆర్ ఎక్స్ 100’ వంటి చిన్న సినిమాతో పెద్ద హిట్‌ని అందుకున్న దర్శకుడు. తొలి చిత్రంతోనే నిర్మాతకు లాభాల పంట పండించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్... తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. మొదటి సినిమాని డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన అజయ్... ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం మాఫియా నేపథ్యాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ‘మహాసముద్రం’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసారని టాక్.

స్పెయిన్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న కీర్తి సురేష్ చిత్రం
‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్... ప్రస్తుతం మరో ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ‘సఖి’ (ప్రచారంలో ఉన్న పేరు)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ నరేంద్ర రూపొందిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని మహేష్ కొనేరు నిర్మిస్తున్నాడు. మహిళలపై జరిగే అకృత్యాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో... కుటుంబ బంధాలకూ ప్రత్యేక స్థానముంటుందని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్, నదియా, నరేష్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

తుది దశకు చేరుకున్న ‘వెంకీమామ’
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన వెంకీ, చైతూ... ఇందులోనూ అవే పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్... చిత్రీకరణ పరంగా తుది దశకు చేరుకుందని సమాచారం. లేటెస్ట్ ఇన్‌ఫర్మేషన్ ప్రకారం... ఈ…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ ‘తమ్ముడు’కి 20 ఏళ్ళు
తెలుగునాట క్రీడా నేపథ్యంలో రూపొందిన పలు చిత్రాలు సందడి చేసాయి. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ ఒకటి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకే వన్నె తెచ్చిన ఈ సినిమాలో పవన్‌కు జంటగా ప్రీతి జింగ్యాని నటించింది. బాలీవుడ్ భామ అదితి గోవిత్రీకర్ మరో నాయికగా నటించగా... అచ్యుత్, భూపేందర్ సింగ్, రాజా కృష్ణమూర్తి, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, అలీ, చంద్రమోహన్, వర్ష తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. పి.ఎ.అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించారు.
‘కేరాఫ్ కంచెర పాలెం’ కు మరో ఘనత
టాలీవుడ్ లో అప్పుడప్పుడు కొన్ని గుర్తుండే సినిమాలు వస్తుంటాయి. అలా వచ్చిన సినిమాల్లో కేరాఫ్ కంచెర పాలెం సినిమా కూడా ఒకటి. అందరూ కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. సుబ్బరావు, రాధా బెస్సె, కెసవ, నిత్య శ్రీ, ప్రనీథ, కార్తీక్ రత్నం, మోహన్ భగత్, పరుచురి విజయ ప్రవీణ్, కిశోర్ కుమార్ పొలిమెర తదితరులు నటించారు.

ఎస్ వి బి సి చైర్మన్ గా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి
రంగం ఏదైనా, విషయం ఏదైనా, సందర్భం ఏదైనా, సమయం ఏదైనా నచ్చిన విషయాన్ని, నమ్మిన విషయాన్ని నమ్మకంగా వాదిస్తే, పాటిస్తే అందుకు తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది అనటానికి ప్రముఖ సినీ హాస్య నటుడు "30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి"ని తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.