
ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 21


ది ప్యారడైజ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్

కల్కి సీక్వెల్ నుండి దీపికా పదుకొణే ఔట్!

BSS 11 ఫస్ట్ లుక్ రానుంది

జైలర్ 2 లో ఫహద్

హిట్ 3 థర్డ్ సింగిల్ 'తను' రిలీజ్

హిట్ 3 సెన్సార్ కంప్లీట్

రెట్రో కోసం విజయ్ దేవరకొండ

ప్రియదర్శి 'ప్రేమంటే' షూట్ అప్డేట్

పుష్ప 2 ఫస్ట్ టైం టీఆర్పీ ఎంతంటే

మేం కలిస్తే ఫిలింనగర్ అంతా రచ్చ లేపేసేవాళ్ళం - సాయి దుర్గతేజ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్‌తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ది ప్యారడైజ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్
దసరా తరువాత నేచురల్ స్టార్ నాని ,డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్.ఇందులో నాని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.రీసెంట్ గా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది.ఇప్పటివరకు సగం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక ఈరోజు హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో నానితో పాటు మిగితా నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

సుందరకాండ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
భైరవం తరువాత నారా రోహిత్ సోలో హీరోగా గత నెలలో సుందరకాండ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు.అయితే ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకున్న అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను సాధించలేకపోయింది.జనాలకు రీచ్ కాకపోవడం వల్లే అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది.జియో హాట్ స్టార్ సుందరకాండను ఈనెల 23నుండి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.ఇక ఓటీటీ లో మాత్రం ఈసినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం ఖాయం.

కల్కి సీక్వెల్ నుండి దీపికా పదుకొణే ఔట్!
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్‌కి సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సీక్వెల్‌లో హీరోయిన్ దీపికా పదుకొణే భాగం కాబోరని, తాము ఆమెతో విడిపోతున్నామని నిర్మాతలు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించారు.

చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది - సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సినీ కార్మికుల సమస్యలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో కార్మిక సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సినీ పరిశ్రమలో సమ్మెలకు బదులుగా, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా సీఎం వారికి సూచించారు.

ఓజీ నుండి ప్రకాష్ రాజ్ క్యారక్టర్ రివీల్ పోస్టర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే, సినిమాలోని మరో కీలక పాత్రను పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో బహుముఖ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని, ఆయన పాత్ర పేరు 'సత్య దాదా' అని అధికారికంగా వెల్లడించారు.

ఉపేంద్ర బర్త్ డే.. ఆంధ్రా కింగ్ తాలూకా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్
కన్నడ చిత్ర పరిశ్రమలో 'రియల్ స్టార్'గా, 'సూపర్ స్టార్'గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఉపేంద్ర నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ఒక గొప్ప కానుక లభించింది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజా చిత్రం 'ఆంధ్రా కింగ్ తాలూకా'లో ఉపేంద్ర నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ఓజీ.. ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు ఆమోదం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ఓజీ'. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న విడుదల కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర బృందానికి గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో టికెట్ ధరల పెంపును ప్రభుత్వం ఆమోదించింది. అలాగే బెనిఫిట్ షోకి కూడా ప్రత్యేక అనుమతులు ఇచ్చింది.

BSS 11 ఫస్ట్ లుక్ రానుంది
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు.అందులో చావు కబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తో తన 11 వ సినిమా చేస్తున్నాడు .హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఇక ఈసినిమా నుండి అప్డేట్ రానుంది. ఈనెల 27న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.టీజర్ కూడా రెడీ అయిపోయిందట. టీజర్ అయితే అదిరిపోయిందని టాక్.మరి ఎప్పుడు వదులుతారో చూడాలి.

హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ స్పై థ్రిల్లర్ ముందే వస్తోంది
ఇంగ్లీష్ సినిమాలు చూసేవారికి హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ పేరు తెలిసేవుంటుంది. ఆయనకు వరల్డ్ వైడ్‌గా కోట్లాదిమంది అభిమానులున్నారు. ఆరుపదుల వయసుకి దగ్గరగా ఉన్నా ఆయన చేసే రియల్ ఫీట్స్ థియేటర్‌లో ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పిస్తాయంటే అతిశయోక్తిలేదు. యాక్షన్ సీన్స్‌లో ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా చేసే తన సాహసోపేత విన్యాసాలతో ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తాడు.

జైలర్ 2 లో ఫహద్
మచ్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈ సినిమా స్టార్ట్ కాగా మేజర్ బ్రేక్ లేకుండా షెడ్యూల్స్ ఫినిష్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం జైలర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ రజినీకాంత్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 600 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ అయ్యి భారీ లాభాలను తీసుకొచ్చింది.

హిట్ 3 థర్డ్ సింగిల్ 'తను' రిలీజ్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది 3rd కేస్'. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో నాని టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

హిట్ 3 సెన్సార్ కంప్లీట్
నేచురల్ స్టార్ నాని హిట్ 3 వచ్చే గురువారమే థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ అయిపొయింది.వైలెన్స్ ఎక్కువగా ఉండడంతో ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.కట్స్ కూడా భారీగా చెప్పారని టాక్.దాదాపు 2 గంటల 37 నిమిషాల రన్ టైం తో హిట్ 3 థియేటర్లలోకి రానుంది.

రివ్యూ: సారంగపాణి జాతకం
సారంగపాణి జాతకం సినిమా ఒకవైపు ఎంటర్‌టైన్ చేస్తూనే మరోవైపు మనుషులలో గూడుకట్టుకునిపోయిన మూఢ నమ్మకాలను, మానసిక దుర్బలత్వాన్ని, వాటి ప్రభావాలను గుర్తుచేస్తుంది. ముఖ్యంగా యువత జాతకాలను పట్టించుకోకూడదని, కష్టపడి పనిచేయాలని అంతర్లీనంగా సందేశం ఇస్తుంది. కథ, పాత్రలు, నటీనటుల పెర్ఫార్మెన్స్ అన్నీ సహజంగా ఉన్నాయి. ఇది కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్ ఒక్కరినే కాకుండా ప్రతి ఒక్కరిని అలరించేలావుంది.

రెట్రో కోసం విజయ్ దేవరకొండ
వెర్సటైల్ స్టార్ సూర్య 'కంగువా' తర్వాత హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'రెట్రో'. సూర్య 44వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. ఆయన సరసన కన్నడ భామ పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

మ్యాడ్ స్క్వేర్ ఓటీటీలో స్ట్రీమింగ్
యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. రెండేళ్ల క్రితం కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'మ్యాడ్'కి సీక్వెల్‌గా తెరకెక్కింది. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ భారీ అంచనాల మధ్య మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రమంలో యూత్‌ని విశేషంగా అలరించిన ఈ మూవీ 80కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

టాప్ బ్యానర్స్‌లో 'ధమాకా' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్స్
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా 'చౌర్య పాఠం'తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెడుతున్నారు. యంగ్ ట్యాలెంటెడ్ ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత.

ప్రియదర్శి 'ప్రేమంటే' షూట్ అప్‌డేట్
ఎక్సయిటింగ్ లైనప్ తో అలరిస్తున్న ప్రియదర్శి, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు క్రేజీ కొలాబరేషన్ లో చేస్తున్న సినిమా 'ప్రేమంటే'."థ్రిల్-యూ ప్రాప్తిరస్తు" అనేది ట్యాగ్‌లైన్. ట్యాలెంట్ యాక్టర్ ఆనంది, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పుష్ప 2 ఫస్ట్ టైం టీఆర్పీ ఎంతంటే
గత ఏడాది చివర్లో థియేటర్లలో విడుదలై ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పుష్ప 2.భారీ అంచనాల మధ్య ఈసినిమా విడుదలకాగా మొదటి రోజు ఏకంగా 294 కోట్ల వసూళ్లతో ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఫుల్ రన్ లో 1800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బాహుబలి 2 ను క్రాస్ చేసింది. హిందీలో అయితే ఏకంగా 800 కోట్లకుపైగా నెట్ వసూళ్లతో ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఆ తరువాత పుష్ప 2 దాదాపు మూడున్నర గంటల రన్ టైం తో ఓటిటి లోకి వచ్చింది.ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో వుంది.

ఓదెల 2లో హీరో ఎవరైనా వుంటే.. అది తిరుపతే - వశిష్ఠ సింహ
తమన్నా భాటియా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఓదెల 2. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్' కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం తమన్నా నాగ సాధువుగా అదరగొట్టారు. వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న విడుదలైన ఓదెల2 అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్ర పోషించిన యాక్టర్ వశిష్ఠ ఎన్. సింహ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.