దసరా తరువాత నేచురల్ స్టార్ నాని ,డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్.ఇందులో నాని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.రీసెంట్ గా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది.ఇప్పటివరకు సగం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక ఈరోజు హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో నానితో పాటు మిగితా నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ నటుడు మోహన్ బాబు ఈసినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండగా కిల్ ఫేమ్ రాఘవ జ్యూయెల్ విలన్ గా నటిస్తున్నాడు. హీరోయిన్ ఎవరనేది తెలియాల్సివుంది. అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.ఈసినిమా తెలుగు ,తమిళ, కన్నడ ,మలయాళం ,హిందీ తోపాటు బెంగాలీ ,ఇంగ్లీష్ ,స్పానిష్ భాషల్లో కూడా విడుదలకానుంది.
అయితే ఈసినిమా విడుదలవుతున్న రోజే రామ్ చరణ్ పెద్ది కూడా థియేటర్లలోకి రానుంది.బుచ్చి బాబు సాన డైరెక్ట్ చేస్తున్నఈసినిమాపై కూడా అంచనాలు భారీగా వున్నాయి.ఒకవేళ రెండు చెప్పిన తేదీకే వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ క్లాష్ జరుగనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























