నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్: ది 3rd కేస్’. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో నాని టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్ సహా ట్రైలర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. అలాగే ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ’ అనే మెలోడీ సాంగ్ విడుదలచేసిన చిత్రయూనిట్.. రీసెంట్‌గా ‘అబ్ కి బార్.. అర్జున్ సర్కార్’ అనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా నేడు హిట్ 3 నుండి థర్డ్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.
‘తను’ అంటూ సాగే ఈ సాంగ్‌ను మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పాడటం విశేషం. రొమాంటిక్ అండ్ ఇంటెన్స్ ఫీల్‌తో పూర్తిగా ఒకే టేక్‌లో షూట్ చేశారు. మిక్కీ జె మేయర్ కంపోజిషన్, అనిరుధ్ వాయిస్ మెస్మరైజ్ చేశాయి. రాఘవ్ రాసిన సాహిత్యం నాని పాత్ర భావోద్వేగాలను డీప్‌గా చూపిస్తుంది. సినిమాలోని క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా ఉండే సున్నితమైన విజువల్స్ కట్టిపడేశాయి. శ్రీనిధి శెట్టి పాత్రను కలవడానికి వెళ్తున్న నానిని హ్యాపీ మూమెంట్‌లో చూడటం, కేఫ్ రీయూనియన్ సన్నివేశం మనసును ఆకట్టుకుంది.
ఇక హిట్ 3 చిత్రానికి సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు. అలాగే కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ చేస్తుండగా.. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ చేశారు. మలయాళ వెర్షన్ రైట్స్ ను ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ కు చెందిన వేఫరర్ ఫిలిమ్స్ దక్కించుకుంది. ఇక ఇప్పటికే యూస్ఎస్ఏలో అడ్వాన్స్ సేల్స్ 115K మార్క్ క్రాస్ చేశాయి. కాగా హిట్: ది 3rd కేస్ మే 1న థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























