నేచురల్ స్టార్ నాని హిట్ 3 వచ్చే గురువారమే థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ అయిపొయింది.వైలెన్స్ ఎక్కువగా ఉండడంతో ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.కట్స్ కూడా భారీగా చెప్పారని టాక్.దాదాపు 2 గంటల 37 నిమిషాల రన్ టైం తో హిట్ 3 థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా అయితే షూర్ షాట్ హిట్ అని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది.ముఖ్యంగా చివరి 30 నిమిషాలు అదిరిపోనుందట.నాని కూడా సినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు.పాన్ ఇండియా రిలీజ్ కావడంతో హీరోయిన్ శ్రీనిధి శెట్టి తో కలిసి అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నాడు.హిట్ టాక్ వస్తే నాని కి బిగ్గెస్ట్ ఓపెనర్ కానుంది.
ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి రానున్నాడని సమాచారం.ఈనెల 27న హైదరాబాద్ లో ఈ ఈవెంట్ ను జరుపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందు హిట్ ,హిట్ 2 ఈవెంట్ల కు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరుకాగా ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి.దాంతో సెంటిమెంట్ గా హిట్ 3 ఈవెంట్ కి రాజమౌళిని ఆహ్వానించారు.
నాని కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీగా వస్తున్న ఈసినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.నాని తోకలిసి ప్రశాంతి తిపిర్నేని ఈసినిమాను నిర్మించారు.ఇక హ్యాట్రిక్ విజయాలతో ప్రస్తుతం పీక్ ఫామ్ లో వున్నాడు నాని.మరి హిట్ 3 తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: