మ్యాడ్ స్క్వేర్ ఓటీటీలో స్ట్రీమింగ్

Mad Square Now Streaming on OTT

యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. రెండేళ్ల క్రితం కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా తెరకెక్కింది. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ భారీ అంచనాల మధ్య మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రమంలో యూత్‌ని విశేషంగా అలరించిన ఈ మూవీ 80కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో ఈ సినిమా ఓటీటీ అప్డేట్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మ్యాడ్ స్క్వేర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా నేటినుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సహా కన్నడ, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. సో.. మూవీ లవర్స్, థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని వీక్షించండి.

కథ :
మూడు సంవత్సరాల తరువాత లడ్డు (విష్ణు) పెళ్ళిలో కలుస్తారు మనోజ్ (రామ్ నితిన్) అశోక్ (నార్నె నితిన్), దామోదర్ (సంగీత్). ఈ మ్యాడ్ గ్యాంగ్ రచ్చ రచ్చ చేసిన తరువాత కొన్ని కారణాల వల్ల ఈ పెళ్లి ఆగిపోతుంది. ఆ తరువాత ఈ నలుగురు కలిసి గోవా ట్రిప్‌కు ప్లాన్ వేస్తారు. ఇక గోవా వెళ్ళాక ఈ గ్యాంగ్ అనుకోకుండా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత అందులోనుండి ఈ గ్యాంగ్ ఎలా బయటపడింది? మ్యాక్స్ (సునీల్) ఈ గ్యాంగ్‌ను ఎందుకు వెతుకుతాడు? చివరికి ఏమైంది? అనేది మిగతా కథ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.