టాప్ బ్యానర్స్‌లో ‘ధమాకా’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్స్

Dhamaka Maker Trinadha Rao Nakkina's Upcoming Movies in Top Banners

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెడుతున్నారు. యంగ్ ట్యాలెంటెడ్ ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం టీజర్ ట్రైలర్ థ్రిల్లింగ్ క్రైమ్, డార్క్ హ్యూమర్ బ్లెండ్ తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. సాంగ్స్ సూపర్ హిట్అయ్యాయి. సమ్మర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా ‘చౌర్య పాఠం’ ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత త్రినాథరావు నక్కిన విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఈ సినిమాని నిర్మించడానికి ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి?

  • కార్తిక్ ఘట్టమనేని ఫాదర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. ఆయన సర్వీస్ లో ఉన్నప్పుడు ఓ చిలిపి దొంగతనం కేసు జరిగింది. ఆ సంఘటన గురించి కార్తిక్ చెప్పినప్పుడు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది.
  • ఇది సినిమాగా చేయమని కార్తిక్ ని అడిగాను. తను సరే అన్నాడు. అలా ఈ సినిమా చేయడం జరిగింది. ఆ కేసుని యధావిధిగా తీసుకోలేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పూర్తి సినిమాటిక్ గా చేయడం జరిగింది.

హైస్ట్ సినిమాలకి బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా..?

  • అవును. మామూలు సినిమాలు కంటే హైస్ట్ సినిమాలు తీయడం ఖర్చుతో కూడుకున్న పని. మేము అనుకున్నదాని కంటే ఒక పదిశాతం బడ్జెట్ పెరిగింది. కంపనీ నుంచి వస్తున్న తొలి సినిమా.
  • ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్యాలిటీతో తీశాం. అందులోనూ కార్తిక్ లాంటి డీవోపీ వున్నప్పుడు టెక్నికల్ గా చాలా యాడ్ ఆన్స్ వుంటాయి. సినిమా అవుట్ పుట్ ఎక్సలెంట్ క్యాలిటీతో వచ్చింది.

హీరో ఇంద్ర రామ్ గురించి?

  • ఇంద్ర రామ్ కొత్త అబ్బాయి. మొదట్లో నేను కాస్త భయపడ్డాను. వర్క్ షాప్ చేశాం. సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత కూడా చిన్న భయం ఉండింది. అయితే రెండు రోజుల తర్వాత క్యారెక్టర్ పట్టేశాడు. అద్భుతంగా చేశాడు.
  • తనే కాదు ఇందులో ప్రతి ఒక్కరూ చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో క్యారెక్టర్స్ తప్పా ఆర్టిస్టులు కనిపించరు. అంత సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు.

డైరెక్టర్ నిఖిల్ గురించి?

  • నిఖిల్ ని కార్తికేయ షూటింగ్ లో చూశాను. చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తాడు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనుకున్న సమయంలో కార్తిక్.. నిఖిల్ పేరు చెప్పాడు. ఈ సినిమాకి విజువల్ సెన్స్ వున్న డైరెక్టర్ కావాలి. నిఖిల్ కి ఆ ఇమాజినేషన్ వుంది.
  • నేను ఎలా అనుకున్నానో అలా సినిమాని తీర్చిదిద్దాడు. సినిమాని హెల్తీగా ఫినిష్ చేశాం. సినిమా చాలా మెచ్యుర్డ్ గా వుంటుంది. కాన్సెప్ట్ అందరినీ అలరిస్తుంది.

నిర్మాణంలోకి రావడానికి కారణం?

  • కొత్తవాళ్ళకి ఒక ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేయడం నా డ్రీం. అది ఎప్పటినుంచో ఉంది. ఒక జనరేషన్ కి ఒక వేదిక ఇచ్చినట్లుగా వుంటుంది.
  • నాకు సంపాదన మీద దృష్టి లేదు. కొత్త వారికి అవకాశం కల్పించాలనే మంచి ఉద్దేశంతోనే నిర్మాణంలోకి రావడం జరిగింది.

చౌర్యపాఠంలో దొంగలకి గుణపాఠం వుంటుందా?

  • దొంగలకి కాదు కానీ దొంగతనం చేయాలనుకునే వారికి ఓ పాఠం వుంటుంది (నవ్వుతూ).

రాజీవ్ కనకాల క్యారెక్టర్ గురించి?

  • తనది మంచి క్యారెక్టర్. నిఖిల్ చాలా కొత్తగా డిజైన్ చేసుకున్నాడు. అలాగే సలీం ఫేకు క్యారెక్టర్ కూడా అలరిస్తుంది.

మ్యూజిక్ గురించి?

  • ఈ సినిమాని కొంతమంది నిర్మాతలు దర్శకులు డిస్ట్రిబ్యూటర్లకి చూపించాను. అందరూ మెచ్చుకున్న ఒకే ఒక వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్.
  • బీజీఎం అద్భుతంగా చేశాడు. పాటలు మంచి హిట్ అయ్యాయి.

హీరోయిన్ పాయల్ రాధకృష్ణ గురించి?

  • ఇది హైస్ట్ ఫిల్మ్. ఇది ఒక ప్రత్యేకమైన లుక్ వుండాలి. అలాగే నేటివిటీ మిస్ అవ్వకూడదు.
  • ఈ క్యారెక్టర్ కి పాయల్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది. చాలా చక్కగా చేసింది.

మొన్న మీరు థియేటర్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి? ఆ కామెంట్స్ చేయడానికి కారణం?

  • వైరల్ కావాలని ఆ కామెంట్స్ చేయలేదు. యధార్ధం తెలియాలని చెప్పాను. నిజానికి నేను థియేటర్స్ కి రమ్మని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేశాను.
  • థియేటర్స్ కల్చర్ ని కంటిన్యూ చేయమని కోరారు. కానీ అది వదిలేసి ముందు చెప్పిన మాటలే హైలెట్ చేశారు.

ఆడియన్స్ థియేటర్స్ కి రావడం తగ్గించడానికి గల కారణం ఏమిటి?

  • చాలా కారణాలు వున్నాయి. సినిమాలు చాలా జాగ్రత్తగా తీయాల్సిన పరిస్థితి వుంది.
  • ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సినిమాలు తీయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి.

డైరెక్టర్ గా కొత్తగా చేయబోతున్న చిత్రాలు?

  • మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు గారు, ఎకే ఎంటర్టైన్మెంట్స్ లో సినిమాలు చేయాలి.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.