ఓజీ.. ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు ఆమోదం

AP Govt Gives Green Signal To Tickets Rate Hike and Benefit Shows For OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ‘. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న విడుదల కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర బృందానికి గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో టికెట్ ధరల పెంపును ప్రభుత్వం ఆమోదించింది. అలాగే బెనిఫిట్ షోకి కూడా ప్రత్యేక అనుమతులు ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు తాజాగా ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 1 గంటకు బెనిఫిట్ షో నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఈ బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.1000/- (GST సహా)గా నిర్ణయించారు. అయితే ఒక రోజులో ఐదు షోలకంటే ఎక్కువ ప్రదర్శనలు అనుమతించరాదు అని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

అదనంగా, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ.125/- (GST సహా), మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.150/- (GST సహా)గా పెంచి వసూలు చేసుకోవడానికి సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 4, 2025 వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కాగా, ఈ ఉత్తర్వులను ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్ జారీ చేశారు. రాష్ట్రంలోని కలెక్టర్లు, లైసెన్సింగ్ అధికారులు మరియు పోలీస్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తుండగా, ఆయన సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే, బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రను పోషిస్తుండగా.. అర్జున్ దాస్ కీలక పాత్రలో సందడి చేయనున్నాడు. ఎస్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన మూవీ ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.