జైలర్ 2 లో ఫహద్

fahadh faasil is on board for jailer 2

మచ్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈ సినిమా స్టార్ట్ కాగా మేజర్ బ్రేక్ లేకుండా షెడ్యూల్స్ ఫినిష్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం జైలర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ రజినీకాంత్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 600 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ అయ్యి భారీ లాభాలను తీసుకొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెల్సన్ దీలిప్ కుమార్ తెరకెక్కించాడు. ఇప్పుడు ఇదే కాంబో లో సీక్వెల్ వస్తుంది. ఇక జైలర్2 లో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ను తీసుకున్నారు. రజినీ నటించిన రీసెంట్ మూవీ వేట్టయన్ లో కూడా ఫహద్ కీలక పాత్ర చేశాడు.ఇక ఇప్పుడు జైలర్ 2 కోసం తీసుకున్నారు.ఫహద్ ను తీసుకోవడం సినిమాకు మరింత బజ్ తీసుకురానుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది పొంగల్ కు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక రజినీకాంత్ ఈసినిమా కన్నా ముందు కూలీతో రానున్నాడు.యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండగా కింగ్ నాగార్జున ,ఉపేంద్ర ,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఈ ఆగస్టు 14న విడుదలకానుంది.ఈసినిమాపై కూడా భారీ అంచనాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.