మేం కలిస్తే ఫిలింనగర్ అంతా రచ్చ లేపేసేవాళ్ళం – సాయి దుర్గతేజ్

Kishkindhapuri Success Meet Hero Sai Durga Tej Says, Tollywood is Now in Evolution Mode

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్‌తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మంచి సినిమాని ముందుకు తీసుకెళుతున్న మీడియా వారికి థాంక్ యూ. సాహు గారితో నాకు మంచి ఒక అనుబంధం ఉంది. సాహు గారి తమ్ముడు డిగ్రీలో నా క్లాస్‌మేట్. ఆ బాండ్ అప్పటినుంచి ఉంది. సాయితో నాకు ముంబైలో యాక్టింగ్ క్లాస్ నుంచి పరిచయం ఉంది. 15 ఏళ్లుగా మా జర్నీ కొనసాగుతోంది. ఫిలింనగర్ అంతా రచ్చ లేపేసేవాళ్ళం.”

“ఈ స్టేజ్ నాకు ఒక రీ-యూనియన్ లాగా ఉంది. వశిష్ట నా టెన్త్ క్లాస్‌మేట్. అలాగే కనిష్క కూడా నా క్లాస్‌మేట్. అందర్నీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చేతన్ భరద్వాజ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అనిల్ గారు నాకు ఎంతో సన్నిహితులు. మా మావయ్య గారితో చేస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సక్సెస్ మీట్‌లో అందరూ నవ్వుకోవడం కూడా ఒక పెద్ద సక్సెస్. ఈ మూమెంట్‌ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం.”

“ఇది మొత్తం ఇండస్ట్రీ సక్సెస్ లాగా భావిస్తున్నాను. ఇండస్ట్రీ ఒక ఎవల్యూషన్ దశలో ఉంది. మంచి కథలు రావాలి. ఆడియన్స్‌ని ఎక్సయిట్ చేసే కథలు రావాలి. అలా వస్తేనే ఆడియన్స్‌కి వస్తారు. అలాంటి సినిమాలు ఇవ్వడం మనందరి బాధ్యత. ‘లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి’.. ఇలా అన్ని సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి. మంచి కంటెంట్‌ని ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంత మంచి హిట్ అందుకున్న కిష్కింధపురి టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్.” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.