ఇంగ్లీష్ సినిమాలు చూసేవారికి హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ పేరు తెలిసేవుంటుంది. ఆయనకు వరల్డ్ వైడ్‌గా కోట్లాదిమంది అభిమానులున్నారు. ఆరుపదుల వయసుకి దగ్గరగా ఉన్నా ఆయన చేసే రియల్ ఫీట్స్ థియేటర్‌లో ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పిస్తాయంటే అతిశయోక్తిలేదు. యాక్షన్ సీన్స్‌లో ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా చేసే తన సాహసోపేత విన్యాసాలతో ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా ఆయన హీరోగా తెరకెక్కిన ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ చిత్రాలైతే వరల్డ్ వైడ్‌గా సినీప్రియులను విశేషంగా అలరించాయి. అయితే మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అలాగే ఇండియాలోనూ ఈ సినిమాలకు భారీ ఫ్యాన్సే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో భాగంగా వస్తోన్న చివరి చిత్రం ‘ఇంపాజిబుల్: ది ఫైనల్ రికనింగ్’ త్వరలో విడుదలకు సిద్ధమైంది.
ఈ క్రమంలో ఈ సినిమాను ఇండియాలో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్టోఫర్ మేక్‌క్వారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 17న దేశవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో విడుదల కానుంది. అయితే ముందుగా నిర్ణయించిన తేదీకన్నా 6రోజుల ముందుగానే ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుండటం విశేషం. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా అభిమానుల కోరిక మేరకు మేకర్స్ ఈ చిత్రాన్ని ముందుగానే విడుదలచేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: