కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 71

nbk 109 intense jaipur schedule wrapped up
షూటింగ్ అప్‌డేట్

NBK 109- ఇంటెన్స్ జైపూర్ షెడ్యూల్ పూర్తి

నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా వరుస హిట్లతోఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న నేపథ్యంలో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే బాలయ్యకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Rana Daggubati's 35 - Chinna Katha Kaadu Postponed
సినిమా వార్తలు

35 - చిన్న కథ కాదు.. విడుదల వాయిదా

ప్రముఖ మలయాళ నటి నివేదా థామస్ తెలుగులో ప్రధానపాత్ర పోషిస్తూ నటిస్తోన్న తాజా చిత్రం '35 - చిన్న కథ కాదు'. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాతో నందకిశోర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఆకట్టుకున్నాయి. అలాగే నివేదా థామస్ పాత్రను పరిచయం చేస్తూ 'సరస్వతీ నమస్తుభ్యం' పేరుతో రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Nallanchu Thellacheera song promo out from mr bachchan movie
సాంగ్

మిస్టర్ బచ్చన్ నుండి ఎనర్జిటిక్ నల్లంచు తెల్లచీర సాంగ్ ప్రోమో రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది వరకు వచ్చిన షాక్‌, మిరపకాయ్‌ ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ అమితాబ్ అభిమానిగా నటించనున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగష్ట్ 14వ తేదీ నుంచి ప్రీమియర్స్‌ ప్రారంభంకానున్నాయి.

TFN Adminవాట్సాప్
Niharika Konidela Strong Counter To Negative Reviews on Committee Kurrollu
సినిమా వార్తలు

ఈ మూవీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే.. నిహారిక కొణిదెల

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. య‌దు వంశీ ద‌ర్శ‌కత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 9న విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
Double iSmart Director Puri Jagannadh Praises Hero Ram Pothineni Energy Levels
సినిమా వార్తలు

రామ్‌ లోని ఆ కసి నన్ను చాలా ఎగ్జైట్ చేస్తుంది - పూరి జగన్నాథ్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీరి కాంబోలోనే వచ్చి సూపర్ హిట్ అయిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సీక్వెల్ గా ఇది రూపొందింది. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలీ, షాయాజీ షిండే, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Director Puri Jagannadh Great Words About SS Rajamouli Father Vijayendra Prasad
సినిమా వార్తలు

విజయేంద్ర ప్రసాద్ గారి నుంచి ఫోన్ కాల్, ఎమోషనల్ అయిన పూరి

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అభిమానులతో ఒక ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్నారు. ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి నుంచి తనకు ఒక ఫోన్ వచ్చిందని, దీని తర్వాత తాను చాలా ఎమోషనల్ అయ్యానని ఆయన తెలియజేసారు. వివరాల్లోకి వెళ్తే.. ఉస్తాద్ రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో వరంగల్‌లో 'డబుల్ ఇస్మార్ట్' ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.

Srikanth Mవాట్సాప్
Suriya’s Kanguva Trailer Released
ట్రైలర్ & టీజర్

కంగువ ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. ప్రముఖ తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు సూర్య నటించిన 'సింగం' సిరీస్‌కు దేవినే సంగీతం అందించిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
nani saripodhaa sanivaaram movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

సరిపోదా శనివారం ట్రైలర్ వచ్చేస్తుంది

న్యాచురల్ స్టార్ నాని నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో నాని సూర్య అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా కథాంశం ఏంటో.. నాని పాత్ర ఎలా ఉంటుందో అన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ఆగష్ట్ 29వ తేదీన రిలీజ్ కానున్న ఈసినిమా ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈమధ్యే ఎస్‍జే సూర్య పుట్టిన రోజు సందర్భంగా నాట్ ఏ టీజర్ అంటూ ఆయనకు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ కూడా వచ్చింది. దీనికి…

TFN Adminవాట్సాప్
varun tej first look out from matka movie
ఫస్ట్ లుక్

మట్కా నుండి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ 'మట్కా'తో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని మ్యాసీవ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

TFN Adminవాట్సాప్
Devara Unit Announces Aayudha Pooja Filming Underway
సినిమా వార్తలు

ఆయుధ పూజ జరుపుకుంటోన్న దేవర

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Ram Pothineni Says, Puri Is A Gun, Heroes Are Like Bullets
సినిమా వార్తలు

పూరి గారు గన్ లాంటి వారు, హీరోలు బుల్లెట్స్ - రామ్ పోతినేని

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‍తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో వరంగల్‌లో 'డబుల్ ఇస్మార్ట్' ప్రీరిలీజ్ ఈవెంట్…

Srikanth Mవాట్సాప్
Double iSmart Pre Release Event Held in a Grand Manner at Warangal
సినిమా వార్తలు

వరంగల్‌లో గ్రాండ్‌గా డబుల్ ఇస్మార్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీరి కాంబోలోనే వచ్చి సూపర్ హిట్ అయిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సీక్వెల్ గా ఇది రూపొందింది. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలీ, షాయాజీ షిండే, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Biju Menon joins For Sivakarthikeyan-AR Murugadoss Movie
సినిమా వార్తలు

శివకార్తికేయన్, మురుగదాస్ మూవీలో బిజు మీనన్ పవర్‌ఫుల్ రోల్

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగు, తమిళ్‌లో గ్రాండ్‌గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఎనౌన్స్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Vishnu Manchu donates 10 lakhs for underprivileged artists welfare
సినిమా వార్తలు

కూతురు ఐరా విద్యా పుట్టినరోజు సందర్భంగా మా కు విష్ణు మంచు 10 లక్షలు విరాళం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు తన కూతురు ఐరా విద్యా మంచు పుట్టిన రోజు సందర్భంగా పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు.

TFN Adminవాట్సాప్
vikram interesting comments on thangalaan movie sequel
సినిమా వార్తలు

తంగలాన్ నాలుగు పార్టులు తీయొచ్చు

తమిళ్ లో రాబోతున్నమోస్ట్ అవైటెడ్ సినిమాల్లో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న తంగలాన్ సినిమా ఒకటి. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తుంది. మరోవైపు ఈసినిమాకోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీసినిమాపై అంచనాలను పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Mr Bachchan fourth single out on August 12th
సాంగ్

మిస్టర్ బచ్చన్ నుండి లాస్ట్ సాంగ్ రానుంది

బ్లాక్ బాస్టర్ మిరపకాయ్ తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్ -మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్.ఈనెల 15న విడుదలకానుంది.అయితే అంత కన్నా ఒక్క రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు.సెలెక్టడ్ థియేటర్లలో ప్రీమియర్స్ పడనున్నాయి.ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.మిక్కీ జె మేయర్ బ్లాక్ బాస్టర్ సాంగ్స్ ఇచ్చాడు.ఈనెల 12న ఈసినిమా నుండి చివరి సాంగ్ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Double Ismart GRAND PRE RELEASE EVENT ON AUGUST 11th
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

మాస్ సినిమా థియేటర్లలోకి వచ్చి చాలా రోజులవుతుంది.అయితే ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ ఆ లోటు తీర్చనుంది.ఈనెల 15న విడుదలకానుంది.ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ట్రైలర్ ,సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ గా వుంది టీం. ఇక రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా జరుపనున్నారు. హన్మకొండ లోని జె ఎన్ ఎస్ ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ జరుగనుంది.

Mahender Reddyవాట్సాప్
nani saripodhaa sanivaaram movie trailer update
ట్రైలర్ & టీజర్

సరిపోదా శనివారం ట్రైలర్ బ్లాస్ట్ కి రెడీ

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. అంతేకాదు ఈసినిమాలో నాని మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఆగష్ట్ 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన అప్ డేట్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.

TFN Adminవాట్సాప్
Diversion Beauty Lyrical Video Out From Aay Movie
సాంగ్

ఆయ్ నుండి 'డైవర్షన్ బ్యూటీ' లిరికల్ వీడియో రిలీజ్

'మ్యాడ్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నితిన్ సోలో హీరోగా నటించిన సినిమా 'ఆయ్'. 'మేం ఫ్రెండ్సండి' అనేది ట్యాగ్ లైన్‌గా ఉంది. కాగా ఆయ్ అనేది గోదావరి ప్రజల వాడుక భాషలో బాగా పాపులర్ అయిన పదం అన్న సంగతి తెలిసందే కదా. దీంతో ఈ సినిమా టైటిల్ తోనే ప్రతి ఒక్కరినీ బాగా ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Double iSmart Ram Pothineni Gym Workout Pics Goes Viral
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్.. రామ్ పోతినేని జిమ్ వర్కవుట్‌ పిక్స్ వైరల్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్