
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 65


ఇంద్ర రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్

మేఘా ఆకాశ్ ఎంగేజ్‌మెంట్.. ఎవరితో అంటే..?

ఆయ్ చూసి ఎన్టీఆర్, బన్నీ రియాక్షన్ ఇదే..!

సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

రేసింగ్‍లోకి నాగచైతన్య.. హైదరాబాద్ టీమ్ సొంతం

ఆయ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

స్త్రీ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్

కూలీ షూటింగ్ అప్డేట్

దేవర సెకండ్ సింగిల్.. యూట్యూబ్‌లో సెన్సేషన్
చిరంజీవి బర్త్ డే.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్


కమిటీ కురోళ్ళు 14డేస్ కలెక్షన్స్
కంటెంట్ ఉంటే చాలు స్టార్ కాస్టింగ్ అవసరం లేదని మరోసారి నిరూపించింది కమిటీ కురోళ్ళు.చిన్న సినిమాగా వచ్చిన ఈచిత్రం మౌత్ టాక్ తో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.నిన్నటి తో ఈసినిమా రెండు వారాల రన్ ను పూర్తి చేసుకుంది.ఇక రెండు వారాలకు గాను ప్రపంచ వ్యాప్తంగా 15.6కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.బ్రేక్ ఈవెన్ టార్గెట్ చిన్నది కావడం తో బయ్యర్లకు మంచి లాభాలను తీసుకొస్తుంది.ఇప్పుడు మూడో వారం లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమాకు థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది. వచ్చే వారం వరకు పెద్ద సినిమా రిలీజ్ లేకపోవడంతో మంచి వసూళ్లను దక్కించుకోనుంది.

ఓటిటిలోకి రాయన్
తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ రాయన్ ఓటిటిలోకి వచ్చేసింది.ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది.అంతేకాదు ఈఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది.ఇది తెలుగులోకూడా రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా డీసెంట్ వసూళ్లతో హిట్ అనిపించుకుంది.

ఇంద్ర రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్
తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతూనే వుంది.ముఖ్యంగా స్టార్ హీరోల బర్త్ డే లకు వారు నటించిన కల్ట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఆనవాయితీగా మారింది.అందులో భాగంగా నిన్న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ఇంద్ర మళ్ళీ థియేటర్లలోకి వచ్చింది.ఇక ఈ రీ రిలీజ్ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.మొదటి రోజు ఈసినిమా 3.05 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుందని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది.దాంతో సీనియర్ హీరోల రీ రీలీజ్ సినిమాల్లో రికార్డు ఓపెనింగ్ పెట్టింది ఇంద్ర.

మేఘా ఆకాశ్ ఎంగేజ్‌మెంట్.. ఎవరితో అంటే..?
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటి మేఘా ఆకాశ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలకమైన అడుగువేశారు. ఓ వైపు నటిగా పలు సినిమాల్లో నటిస్తున్న ఆమె హఠాత్తుగా పెళ్ళికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిన్న తన ప్రియుడు సాయి విష్ణుతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ మేరకు విషయాన్ని మేఘా ఆకాశ్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఐఫా ఉత్సవం అవార్డ్స్.. నామినేషన్స్ దక్కించుకున్న తెలుగు చిత్రాలు
ఇండియన్ సౌత్ ఫిల్మ్ అవార్డులకు సంబంధించిన ప్రతిష్టాత్మక వేదిక 'ఐఫా ఉత్సవం' (IIFA) వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. ఈ యేడాది తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం పరిశ్రమలకు చెందిన అత్యుత్తమ చిత్రాలకు అవార్డు ప్రెజెంటేషన్‌లు అందించనుంది. ఇక వేడుకల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కూడిన గ్రాండ్ గాలా కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశం సిద్ధమవుతోంది.

పవన్ కళ్యాణ్‌ని కలిసిన ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాల ప్రొడ్యూసర్స్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన సినిమాలపై దృష్టి పెడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే.

ఆయ్ చూసి ఎన్టీఆర్, బన్నీ రియాక్షన్ ఇదే..!
మ్యాడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. తాజాగా ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నయన్ సారిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి అంజి.కే.మణిపుత్ర దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదలైంది.

సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
గత ఏడాది దసరా ,హాయ్ నాన్న లతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన నాని ఈ సారి సరిపోదా శనివారంతో రానున్నాడు.వచ్చే గురువారం ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ప్రస్తుతం నాని ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా వున్నాడు.ఒక్క తెలుగులోనే కాదు అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నాడు.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరుపనున్నారు.సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ స్టార్ట్ కానుంది.అయితే చీఫ్ గెస్ట్ ఎవరు లేకుండానే ప్రీ రిలీజ్ జరుగనుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది ఈసినిమా.వివేక్ కు ఈ జోనర్ లో ఇదే మొదటి సినిమా.అటు నాని మాత్రం సినిమా పై…

రేసింగ్‍లోకి నాగచైతన్య.. హైదరాబాద్ టీమ్ సొంతం
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. చైతుకి ఆటో మైబైల్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కారు రేసింగ్స్ అన్నా, ఫార్ములా వన్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశారు. అలాగే ఆయన ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ కార్లను, మోటార్ సైకిల్స్‌ను కూడా సేకరిస్తుంటారు. అలాంటి ఇష్టమైన రంగంలోకి చైతన్య అడుగు పెట్టారు.

మారుతీ నగర్ సుబ్రమణ్యం.. తెలుగు రివ్యూ
అలాగే టెక్నికల్ పరంగా ఈ సినిమా ఉన్నతంగా వుంది. కళ్యాణ్ నాయక్ పాటలు ఆకట్టుకున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన 'మేడమ్ సార్ మేడమ్ అంతే' ట్యూన్, చిత్రీకరణ సూపర్బ్. అలాగే నేపథ్య సంగీతం సైతం కామెడీ సన్నివేశాలకు తగ్గట్టుగా వుంది. ఎంఎన్ బాల్ రెడ్డి కెమెరా వర్క్ చాలా బావుంది. ఎడిటర్ బొంతల నాగేశ్వరరావు పనితనం కామెడీకి హెల్ప్ అయ్యింది. నిర్మాణ విలువలు బావున్నాయి. తబితా సుకుమార్ సమర్పణ వల్ల సినిమాకు మంచి ప్రచారం దక్కింది. మొత్తానికి మారుతీ నగర్ సుబ్రమణ్యం మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.

ఆయ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది ఆయ్.డబుల్ ఇస్మార్ట్,మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలతో పోటీలో నిలిచి ఇప్పుడు వాటి కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టుకుంటుంది ఆయ్.బుధవారంతో ఈసినిమా మొదటి వారం కంప్లీట్ చేసుకుంది.దాంతో ఫస్ట్ వీక్ లో ప్రపపంచ వ్యాప్తంగా 9.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అంతేకాదు ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను కూడా పూర్తి చేసుకుని హిట్ అనిపించుకుంది ఈసినిమా.ఫుల్ రన్ లో 15కోట్ల వరకు రాబట్టుకునే ఛాన్స్ వుంది. మరో వారం వరకు పెద్ద సినిమాల విడుదలేకపోవడం కూడా కలిసి రానుంది.

35.. చిన్నా ఇది వింత లోకం పాటకు సూపర్ రెస్పాన్స్
మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్."35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

స్త్రీ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్
బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ మూవీ స్ట్రీ 2 అదరగొడుతుంది.కేవలం రెండు రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా వర్కింగ్ డేస్ లోకూడా జోరు చూపిస్తుండడం తో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటి తో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 400కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.నిన్న దేశ వ్యాప్తంగా 20.4కోట్ల నెట్ ను రాబట్టుకుంది దాంతో మొదటి వారంలో దేశ వ్యాప్తంగా 289కోట్ల నెట్ ను సొంతం చేసుకుంది.ఈరోజుతో 300కోట్ల క్లబ్ లోకి చేరనుంది. అంతేకాదు కల్కి 2898 ఏడి హిందీ వసూళ్లను క్రాస్ చేసి ఈఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టుకున్న సినిమాగా స్త్రీ 2 రికార్డు సృష్టించనుంది.కల్కి అక్కడ 295కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.

కూలీ షూటింగ్ అప్డేట్
సూపర్ స్టార్ రజినీకాంత్-యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న సినిమా కూలీ.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.రజినీ ఈ లాంగ్ షెడ్యూల్ లో ఈనెల 25న జాయిన్ కానున్నాడు.ఇంతకుముందు చెన్నైలో జరిగిన షెడ్యూల్ లో ఓ మాస్ సాంగ్ ను చిత్రీకరించారు.లోకేష్ మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది విడుదలకానుంది.

ఓటిటిల్లోకి వచ్చేసిన కల్కి
బ్లాక్ బాస్టర్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి ఓటిటిల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.ఈరోజునుండి తెలుగు వెర్షన్ తో సహా కన్నడ,మలయాళ,తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తీసుకురాగా హిందీ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక ఓటిటిల్లో కూడా ఈసినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

దేవర సెకండ్ సింగిల్.. యూట్యూబ్‌లో సెన్సేషన్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్‌గా మేకర్స్ ‘దేవర’ నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే విడుదలైన ‘ఫియర్ సాంగ్’ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
చిరంజీవి బర్త్ డే.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ హీరోలు, దర్శకులు సహా పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే చిరు తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్యకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ ప్రకటన విడుదలచేశారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్, సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్ తదితరులు మెగాస్టార్‌కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

చిరంజీవి బర్త్ డే.. విషెస్ తెలిపిన వెంకటేష్, ఎన్టీఆర్, నాని సహా పలువురు హీరోలు
మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరిలో విక్టరీ వెంకటేష్, నాగార్జున అక్కినేని, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ మేకా, యంగ్ హీరోలు నితిన్, కార్తికేయ, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్, సుశాంత్.. దర్శకులు బాబీ, హను రాఘవపూడి, మారుతి, బీవీఎస్ రవి తదితరులు ఉన్నారు. అలాగే చిరు పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల కూడా తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ దంపతులు
మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం తిరుమల ఆలయాన్ని సందర్శించారు. సతీమణి సురేఖ, తల్లి అంజనాదేవి సహా ఇతర కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రికే తిరుమల చేరుకున్న చిరంజీవి కుటుంబసభ్యులతో స్థానిక ఫీనిక్స్ అతిథిగృహంలో బసచేశారు. ఈ సందర్భంగా ఆయనకు టీటీడీ రిసెప్షన్ అధికారులతో పాటు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

మెగాస్టార్ బర్త్ డే.. స్పెషల్ విషెస్ తెలిపిన విశ్వంభర టీమ్
మెగాస్టార్ చిరంజీవి నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో చిరుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్ట్ పంచుకుంది. అందులో.. "చీకటి మరియు చెడు ప్రపంచాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, వాటిపై పోరాడటానికి ఒక మాగ్నానిమస్ స్టార్ ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు. మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. విశ్వంభర సమేతంగా మీ ప్రభను ప్రపంచాన్ని సాక్షాత్కరింపజేయండి" అని అందులో పేర్కొంది.