చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది ఆయ్.డబుల్ ఇస్మార్ట్,మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలతో పోటీలో నిలిచి ఇప్పుడు వాటి కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టుకుంటుంది ఆయ్.బుధవారంతో ఈసినిమా మొదటి వారం కంప్లీట్ చేసుకుంది.దాంతో ఫస్ట్ వీక్ లో ప్రపపంచ వ్యాప్తంగా 9.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అంతేకాదు ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను కూడా పూర్తి చేసుకుని హిట్ అనిపించుకుంది ఈసినిమా.ఫుల్ రన్ లో 15కోట్ల వరకు రాబట్టుకునే ఛాన్స్ వుంది. మరో వారం వరకు పెద్ద సినిమాల విడుదలేకపోవడం కూడా కలిసి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫన్ మూవీ గా కొత్త డైరెక్టర్ అంజి కె మణిపుత్ర తెరకెక్కించిన ఈసినిమాలో నార్నె నితిన్ హీరోగా నటించగా నయన్ సారిక హీరోయిన్ గా నటించింది.అంకిత్ కొయ్యా ,కసిరెడ్డి రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు.రామ్ మిర్యాల సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్,విద్యా కొప్పినీడి నిర్మించారు.
ఇక హీరోగా నితిన్ కు ఇది రెండో సక్సెస్.గత ఏడాది మ్యాడ్ తో ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు ఆయ్ తో మరో విజయాన్ని అందుకున్నాడు.మరి నెక్స్ట్ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి.ప్రస్తుతం నితిన్ రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో ఒకటి మ్యాడ్ స్క్వేర్.మ్యాడ్ కు సీక్వెల్ గా వస్తుంది. మరొకటి శ్రీ శ్రీ శ్రీ రాజావారు.నితిన్ నుండి నెక్స్ట్ రిలీజ్ ఇదే.శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్నాడు.త్వరలోనే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























