మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం తిరుమల ఆలయాన్ని సందర్శించారు. సతీమణి సురేఖ, తల్లి అంజనాదేవి సహా ఇతర కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రికే తిరుమల చేరుకున్న చిరంజీవి కుటుంబసభ్యులతో స్థానిక ఫీనిక్స్ అతిథిగృహంలో బసచేశారు. ఈ సందర్భంగా ఆయనకు టీటీడీ రిసెప్షన్ అధికారులతో పాటు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గురువారం తెల్లవారుజామున చిరంజీవి దంపతులు స్వామివారి సుప్రభాతసేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికీ వేద ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా చిరంజీవికి దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి శ్రీవారి దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. మరోవైపు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పెద్దఎత్తున అభిమానులు పోటీపడ్డారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: