మెగాస్టార్ చిరంజీవి నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో చిరుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్ట్ పంచుకుంది. అందులో.. “చీకటి మరియు చెడు ప్రపంచాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, వాటిపై పోరాడటానికి ఒక మాగ్నానిమస్ స్టార్ ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు. మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. విశ్వంభర సమేతంగా మీ ప్రభను ప్రపంచాన్ని సాక్షాత్కరింపజేయండి” అని అందులో పేర్కొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా చిరంజీవి హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. కునాల్ కపూర్, సురభి, ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్‌లోనే ఇంతకుముందెన్నడూ లేనివిధంగా భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు విక్రమ్, వంశీ, ప్రమోద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విశ్వంభరలో ప్రముఖ నటీనటులు, టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. కాగా విశ్వంభర 2025లో జనవరి 10 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: