తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ రాయన్ ఓటిటిలోకి వచ్చేసింది.ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది.అంతేకాదు ఈఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది.ఇది తెలుగులోకూడా రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా డీసెంట్ వసూళ్లతో హిట్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాయన్ లో ధనుష్ టైటిల్ రోల్ లో నటించడమే కాదు డైరెక్షన్ కూడా చేశాడు.యాక్షన్ ఎంటెర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం,అపర్ణ బాలమురళి,దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఇక గత ఏడాది సన్ పిక్చర్స్ కు జైలర్ భారీ లాభాలు తీసుకురాగా ఈఏడాది రాయన్ తో లాభాలొచ్చాయి.దాంతో నిన్న ధనుష్ కు సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ రెండు చెక్కులను అందచేశాడు.అందులో ఒకటి హీరో రెమ్యూనరేషన్ కాగా మరొకటి డైరెక్టర్ రెమ్యునరేషన్.
ప్రస్తుతం ధనుష్,కుబేరలో నటిస్తున్నాడు.శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి.ఈఏడాది చివర్లో థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























