సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ 

Saripodhaa Sanivaaram Pre Release Event Tomorrow

గత ఏడాది దసరా ,హాయ్ నాన్న లతో బ్యాక్  టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన నాని ఈ సారి సరిపోదా శనివారంతో రానున్నాడు.వచ్చే గురువారం ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ప్రస్తుతం నాని ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా వున్నాడు.ఒక్క తెలుగులోనే కాదు అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నాడు.ఇక ప్రమోషన్స్ లో భాగంగా  ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరుపనున్నారు.సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ స్టార్ట్ కానుంది.అయితే చీఫ్ గెస్ట్ ఎవరు లేకుండానే ప్రీ రిలీజ్ జరుగనుంది. 

వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది ఈసినిమా.వివేక్ కు ఈ జోనర్ లో ఇదే మొదటి సినిమా.అటు నాని మాత్రం సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా  వున్నాడు. ఇంతకుముందు వీరి కాంబో లో వచ్చిన అంటే సుందరానికి నిరాశపరిచిన వివేక్ పై నమ్మకంతో మరోసారి ఛాన్స్ ఇచ్చాడు నాని.మరి సరిపోదా శనివారం వీరిద్దరికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.ఇందులో ప్రియాంక మోహన్  హీరోయిన్ గా నటించగా ఎస్ జె సూర్య విలన్ గా చేశాడు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.డివివి ఎంటర్ టైన్మెంట్స్  నిర్మించింది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఇక ఈసినిమా తరువాత  నాని ఎవరి తో సినిమా చేయనున్నాడనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.నాని చేతిలో చాలా సినిమాలే వున్నాయి.అందులో హిట్ 2కి సీక్వెల్ చేయాల్సి వుంది అలాగే దసరా డైరెక్టర్ తో రెండో సినిమాకు ఓకే చెప్పాడు.ఇవి కాకుండా సుజీత్ తో కూడా సినిమా లైన్లో వుంది.వీటిలో నాని ముందుగా  హిట్ 2  సీక్వెల్ మొదలు పెట్టే అవకాశాలు వున్నాయి.అయితే సరిపోదా శనివారం రిలీజ్ తరువాతే నాని నెక్స్ట్ సినిమా గురించి క్లారిటీ రానుంది. 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.