బ్లాక్ బాస్టర్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి ఓటిటిల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.ఈరోజునుండి తెలుగు వెర్షన్ తో సహా కన్నడ,మలయాళ,తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తీసుకురాగా హిందీ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక ఓటిటిల్లో కూడా ఈసినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా మహాభారతం ఎపిసోడ్ లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.56 రోజుల థియేట్రికల్ రన్ తరువాత ఓటిటిల్లోకి వచ్చింది ఈసినిమా.ఓ స్టార్ హీరో లేటెస్ట్ మూవీ ఇన్ని రోజుల గ్యాప్ తరువాత ఓటిటి లోకి రావడం ఇదే మొదటి సారి.ఇప్పటికీ ఈసినిమా థియేటర్లలో ఆడుతుంది.కలెక్షన్ల విషయానికి వస్తే 1000కోట్లకు పైగా రాబట్టి తెలుగులో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో సినిమాగా రికార్డు సృష్టించింది.
మొదటి స్థానంలో బాహుబలి 2 ఉండగా ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో వుంది.అంతేకాదు ఈఏడాది ఇండియన్ మూవీస్ లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది కల్కి.మరి ఈఏడాది మచ్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గా విడుదలవుతున్న పుష్ప 2 ఈ రికార్డును బ్రేక్ చేస్తుందో చూడాలి.
నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కిలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో నటించగా సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. వైజయంతి మూవీస్ నిర్మించింది.ఇక కల్కికి సీక్వెల్ కూడా రానుంది.అన్నికుదిరితే సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: