బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ మూవీ స్ట్రీ 2 అదరగొడుతుంది.కేవలం రెండు రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా వర్కింగ్ డేస్ లోకూడా జోరు చూపిస్తుండడం తో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటి తో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 400కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.నిన్న దేశ వ్యాప్తంగా 20.4కోట్ల నెట్ ను రాబట్టుకుంది దాంతో మొదటి వారంలో దేశ వ్యాప్తంగా 289కోట్ల నెట్ ను సొంతం చేసుకుంది.ఈరోజుతో 300కోట్ల క్లబ్ లోకి చేరనుంది. అంతేకాదు కల్కి 2898 ఏడి హిందీ వసూళ్లను క్రాస్ చేసి ఈఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టుకున్న సినిమాగా స్త్రీ 2 రికార్డు సృష్టించనుంది.కల్కి అక్కడ 295కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఫుల్ రన్ లో స్త్రీ 2 600కోట్ల మార్క్ ను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.శ్రద్దా కపూర్ తప్ప పెద్దగా స్టార్ కాస్టింగ్ లేకుండా వచ్చిన ఈసినిమా ఊహించని వసూళ్లను దక్కించుకుంటుంది. స్త్రీ 2ను అమర్ కౌశిక్ తెరకెక్కించగా శ్రద్దా కపూర్ తోపాటు రాజ్ కుమార్ రావు,పంకజ్ త్రిపాఠి,అభిషేక్ బెనర్జీ కీలక పాత్రల్లో నటించారు.
2018 లో వచ్చిన సూపర్ హిట్ మూవీ స్త్రీకి సీక్వెల్ గా వచ్చింది ఈసినిమా.ఇందులో కామెడీ హైలైట్ అయ్యింది.దీనికి కూడా సీక్వెల్ రానుంది.మొత్తానికి ఈఏడాది సరైన సినిమాలు లేక వెలవెలబోయిన బాలీవుడ్ బాక్సాఫీస్ స్త్రీ 2తో మళ్ళీ కలకలలాడుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: