35.. చిన్నా ఇది వింత లోకం పాటకు సూపర్ రెస్పాన్స్

35 Chinna Katha Kaadu Chinna Idi Vintha Lokam Lyrical Song Released

మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మేకర్స్ చిన్నా ఇది వింత లోకం సాంగ్ రిలీజ్ చేశారు. చిల్డ్రన్స్, ఇన్నోసెంట్ హార్ట్స్‌ని బ్యూటీఫుల్‌గా ప్రజెంట్ చేసిన ఈ పాటని వివేక్ సాగర్ సూపర్బ్‌గా కంపోజ్ చేశారు. భరద్వాజ్ గాలి రాసిన లిరిక్స్ అందరూ రిలేట్ చేసుకునేలా వున్నాయి. సింగర్ విజయ్ ప్రకాష్ లైవ్లీగా పాడిన ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది.

స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. విజువల్ అప్పీల్‌ని యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు, ఎడిటింగ్ టిసి ప్రసన్న నిర్వహిస్తున్నారు. 35-చిన్న కథ కాదు మూవీ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో త్వరలోనే విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.