
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 66


మగధీర విలన్ 'అహో! విక్రమార్క' ట్రైలర్ రిలీజ్

సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

ది గోట్ సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కి రెడీ
ఆయ్ టీమ్‌ను అభినందించిన ఐకాన్ స్టార్

ఓజీ గురించి అదిరిపోయే అప్‌డేట్

ఆయ్ ఫన్ ఫెస్టివల్‌లో తండేల్ టీమ్ సందడి

దసరా బరిలో నార్నె నితిన్ శ్రీ శ్రీ శ్రీ రాజావారు

లక్కీ భాస్కర్ రిలీజ్ మళ్ళీ వాయిదా.. కొత్త డేట్ ఇదే!

యువరాజ్ సింగ్ బయోపిక్ అనౌన్స్‌మెంట్

అన్నయ్య కావలసిన వారి కోసం ఎంతవరకైనా తగ్గుతారు - పవన్ కళ్యాణ్
నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి అని, కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారని పేర్కొన్నారు మెగాస్టార్ సోదరుడు, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేడు చిరంజీవి జన్మదినం సందర్భంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ ఓ లేఖను విడుదల చేశారు. అందులో అన్నయ్య చిరంజీవి గొప్పతనం గురించి వివరించిన ఆయన, చిరు వంటి వ్యక్తిని అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటానని చెప్పారు.

ఇందులో నాని, సూర్య ఇద్దరూ పోటాపోటీగా నటించారు - దిల్ రాజు
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్‌జే. సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.

మగధీర విలన్ 'అహో! విక్రమార్క' ట్రైలర్ రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్ 'మగధీర'లో విలన్ పాత్రలో మెరిసిన ఉత్తరాది నటుడు దేవ్ గిల్ గుర్తుండేవుంటాడు. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో అనంతరం పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి మెప్పించాడు. అయితే దేవ్ గిల్ ప్రస్తుతం హీరోగా ‘అహో! విక్రమార్క’ అనే సినిమా చేస్తున్నాడు. ఆయన హోం బ్యానర్ దేవ్ గిల్ ప్రొడక్షన్స్ పై రూపొందుతోన్న ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది.

నాకు కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్‌ఫర్మ్ - నాని
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్‌జే. సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.

సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

ది గోట్ సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కి రెడీ
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)'. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించగా ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, జయరామ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఆయ్ టీమ్‌ను అభినందించిన ఐకాన్ స్టార్
మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న రిలీజైన ఈ ఫన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకాదరణతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేటర్స్‌లో సందడి చేస్తోంది.

తెలుసు కదా.. శ్రీనిధి శెట్టికి వెల్‌కమ్ చెప్పిన టీమ్
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న న్యూ మూవీ 'తెలుసు కదా'. రాశి ఖన్నా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తుండగా.. వైవా హర్ష ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్‌గా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ మొదటి షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్‌లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నారు. ఇది మొత్తం 30 రోజుల పాటు సాగే క్రూషియల్ షెడ్యూల్ అని మేకర్స్ తెలిపారు.

ఓజీ గురించి అదిరిపోయే అప్‌డేట్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన సినిమాలపై దృష్టి పెడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఆ హాలీవుడ్ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు డిస్నీ యొక్క విజువల్ స్టన్నింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ముఫాసా ది లయన్ కింగ్ తెలుగు వెర్షన్ కోసం వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. ఇందులో ప్రధానపాత్ర అయిన ముఫాసాకు ఆయన డబ్బింగ్ చెప్తుండటం విశేషం. కాగా గతంలో వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ది లయన్ కింగ్’ సినిమాకు ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ప్రీక్వెల్‌గా వస్తోంది. ఇండియాలో ఈ యేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఆంగ్లం, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.

ఆయ్ ఫన్ ఫెస్టివల్‌లో తండేల్ టీమ్ సందడి
మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న రిలీజైన ఈ ఫన్ ఎంటర్ టైనర్ ప్రేక్షకాదరణతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేటర్స్‌లో సందడి చేస్తోంది.

దసరా బరిలో నార్నె నితిన్ శ్రీ శ్రీ శ్రీ రాజావారు
మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల హిట్‌తో దూసుకుపోతున్నారు నార్నె నితిన్. చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్, "శతమానం భవతి" దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు, ఎమ్.సుబ్బారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంపద హీరోయిన్‌గా నటిస్తోంది.

గోపీచంద్ మలినేని, సన్నీడియోల్ మూవీలో స్టార్ యాక్టర్
'క్రాక్', 'వీరసింహారెడ్డి' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వరుస సక్సెస్‌లు అందుకున్న టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తాజాగా మరో సర్‌ప్రైజింగ్ ప్రాజెక్టుతో ప్రేక్షకులముందుకొస్తున్నాడు. గదర్ 2తో గతేడాది బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సన్నీ డియోల్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో కోర్ టీమ్ మరియు ప్రత్యేక అతిథులతో సినిమా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు కామెంట్స్.. సుధీర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్
'బాహుబలి' సినిమాతో తొలిసారిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలి ముందువరకూ సౌత్ సినిమాలంటే ఒకరకమైన చిన్న చూపు చూసే హిందీ జనాలకి ఈ సినిమా తర్వాత ఆ ధోరణి మారింది. అప్పటినించీ ప్రభాస్ నటించిన ప్రతి సినిమా అక్కడ స్టార్ హీరోలకు సమానంగా, ఒక్కోసారి అంతకుమించి అన్నట్టుగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపే కలెక్షన్స్‌తో సత్తా చాటుతోంది.

లక్కీ భాస్కర్ రిలీజ్ మళ్ళీ వాయిదా.. కొత్త డేట్ ఇదే!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పటినుంచీ ఆయన తరచుగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. సీతారామం' చిత్రంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ అందుకున్న దుల్కర్.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చినకల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’.

కమర్షియల్ చిత్రానికి పర్‌ఫెక్ట్ నిర్వచనం ఇంద్ర - చిరంజీవి
కమర్షియల్ చిత్రానికి పర్‌ఫెక్ట్ నిర్వచనం 'ఇంద్ర' సినిమా అని, అందులో నటీనటుల పెర్ఫార్మెన్స్ సహా కథ, డైలాగ్స్, సీన్స్, ఎమోషన్స్, మ్యూజిక్, సాంగ్స్, ఫైట్స్, ఫోటోగ్రఫీ.. ఇలా అన్నీ పీక్స్‌లో ఉంటాయని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన జన్మదినం సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతుంది.

కమిటీ కుర్రోళ్లు పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది.

యువరాజ్ సింగ్ బయోపిక్ అనౌన్స్‌మెంట్
ఇండియాలో క్రికెట్ ఆటకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. స్టార్ క్రికెటర్లనైతే దేవుళ్ళు మాదిరి భావిస్తుంటారు ఫ్యాన్స్. అలాంటివారిలో ఒకరు టీమిండియా మాజీ క్రికెటర్, స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలవడంలో కీలక భూమిక పోషించాడు యువీ. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్‌లో అయితే ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో ఏకంగా ఒకే ఓవర్లో 6 సిక్స్ లు బాది ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన విషయాన్ని క్రికెట్ ప్రేమికులెవరూ అంత త్వరగా మర్చిపోలేరు.

ప్రతీ భర్త తన భార్యకు డేడికేట్ చేయాల్సిన పాట ఇది - దిల్ రాజు
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించగా.. సంగీర్తన హీరోయిన్‍గా నటించింది. రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. సందీర్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న గ్రాండ్ రిలీజ్ కానుంది. హీరో సుహాస్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా నుంచి ‘నా ఫేవరేట్ నా పెళ్లాం’ సాంగ్‌ను లాంచ్ చేశారు.

క నుండి ఫస్ట్ సింగిల్ వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ రిలీజ్
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పాట హీరో కిరణ్ అబ్బవరం వాసుదేవ్ క్యారెక్టరైజేషన్ ను ఆవిష్కరించింది. 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' పాటకు సనాపతి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాయగా..సామ్ సీఎస్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు.