
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 64


వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ అప్డేట్

గ్రాండ్‌గా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్

జనక అయితే గనక.. హీరో చేతికి యుఎస్‌ఏ రైట్స్

ఇంట్రెస్టింగ్‌గా ప్రియదర్శి కొత్త సినిమా టైటిల్

35-చిన్న కథ కాదు.. రిలీజ్ డేట్ ఫిక్స్

సరిపోదా శనివారం బుకింగ్స్ ఓపెన్

ఫ్యామిలీతో కలిసి కాలినడకన తిరుమలకు నాని

ఆయ్ వల్ల నాకు ఎక్కువ ఎక్స్‌పోజర్ వచ్చింది

షూటింగ్ లో రవితేజకు గాయం

తంగలాన్.. సెకండ్ వీక్‌లో పెరిగిన స్క్రీనింగ్స్

మట్కా షూటింగ్ అప్డేట్

సరిపోదా శనివారం రన్ టైమ్ ఎంతో చెప్పేసిన నాని

గ్రాండ్ గా కిరణ్ అబ్బవరం -రహస్య వివాహం

స్వాగ్ టీజర్ రానుంది
వరస విజయాలతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు హీరో శ్రీ విష్ణు.గత ఏడాది సామజవరగమన తో వచ్చి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టగా ఈ ఏడాది ఓం భీమ్ బుష్ తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేందుకు సిద్దమవుతున్నాడు ఈహీరో.అందులో భాగంగా తనకు రాజరాజ చోరతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ హసిత్ గోలితో స్వాగ్ అనే సినిమా చేస్తున్నాడు.ఇందులో శ్రీ విష్ణు డిఫరెంట్ గెటప్ లలో కనబడనున్నాడు.ఇక ఈసినిమా టీజర్ రానుంది.ఈనెల 29న ఈ టీజర్ ను విడుదలచేయనున్నారు.

వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ అప్‌డేట్
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్‍ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో కొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో SVC58గా వస్తోన్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. మరో కథానాయికగా 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి కనిపించనుంది.

లయన్ కింగ్ తెలుగు ట్రైలర్ రిలీజ్.. 'ముఫాసా'కి మహేష్ డైలాగ్స్ అదుర్స్
డిస్నీ స్టూడియోస్ నుండి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ విజువల్ స్టన్నింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ముఫాసా: ది లయన్ కింగ్'. గతంలో వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ది లయన్ కింగ్’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తోంది. కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధానపాత్ర అయిన ముఫాసాకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది.

గ్రాండ్‌గా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌లో ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

కన్నప్ప.. అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

జనక అయితే గనక.. హీరో చేతికి యుఎస్‌ఏ రైట్స్
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న సినిమా 'జనక అయితే గనక'. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తున్నాడు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇంట్రెస్టింగ్‌గా ప్రియదర్శి కొత్త సినిమా టైటిల్
శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో ఇదివరకే 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' లాంటి చక్కటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో యంగ్ హీరో ప్రియదర్శి కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు 'సారంగపాణి జాతకం' అనే టైటిల్ ఖరారు చేశారు.

35-చిన్న కథ కాదు.. రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ '35-చిన్న కథ కాదు'. క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమని రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ వాల్టెయిర్ ప్రొడక్షన్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపధ్యంలో రుప్పొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.

ప్రభాస్‌పై అర్షద్ వార్సి కామెంట్స్‌పై నాగ్ అశ్విన్ రియాక్షన్ ఇదే
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై కల్కి 2898 AD డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ప్రభాస్ హీరోగా, ఆయన దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఈ చిత్రం ఓటీటీ లోకి కూడా వచ్చేసింది.

సరిపోదా శనివారం బుకింగ్స్ ఓపెన్
బ్యాక్ టు బ్యాక్ హిట్ల తరువాత హ్యాట్రిక్ కొట్టడానికి సరిపోదా శనివారంతో వస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని.మరో 5రోజుల్లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం నాని అన్నీ తానై సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.దాదాపు అన్ని ఏరియాల్లో బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి.అటు నార్త్ అమెరికా లో అడ్వాన్స్ సేల్స్ 150k దాటాయి.

కమిటీ కుర్రోళ్ళు.. మూడో వారంలో మరింత పెరిగిన కలెక్షన్స్
డిఫరెంట్ కంటెంట్ చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని తెలుగు ప్రేక్షకులు మరోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆడియెన్స్, విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీ నుంచి అభినందనలు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఇప్పటికే సినిమా అన్నీ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం రూ.15.6 కోట్ల కలెక్షన్స్‌ను సాధించటం విశేషం.

ఫ్యామిలీతో కలిసి కాలినడకన తిరుమలకు నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'సరిపోదా శనివారం' సినిమా ఈనెల 29న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారి ఆశీస్సులు కోరుతూ తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ మేరకు హీరో నాని కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఆయన వెంట సతీమణి అంజన, తనయుడు అర్జున్ మరియు సరిపోదా శనివారం సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ ఉన్నారు.

ఆయ్ వల్ల నాకు ఎక్కువ ఎక్స్‌పోజర్ వచ్చింది
సంగీత దర్శకుడిగా అన్ని జోనర్ సినిమాలు చేయాలని వుంది. చిన్నప్పటి నుంచి కమర్షియల్ సినిమాలు చూస్తూ పెరిగాను. కమర్షియల్ సినిమాలకు సంగీతం అందించాలనేది నా కోరిక. సంగీతాన్ని ట్రెండీగా.. కమర్షియల్‌గా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇటీవల విడుదలైన 'ఆయ్' సినిమా నాకు సంగీత దర్శకుడిగా మంచి పేరును తీసుకొచ్చింది' అన్నారు సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. నార్నె నితిన్, నయన్ సారిక జంటగా నటించగా అంజి కే. మణిపుత్ర దర్శకత్వంలో ఆయ్ తెరకెక్కింది.

శివకార్తికేయన్ అమరన్.. తెలుగు రైట్స్ ప్రముఖ సంస్థ చేతికి
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ చిత్రం నిజ జీవితం ఆధారంగా తెరక్కుతుండటం విశేషం. శివ అరూర్ మరియు రాహుల్ సింగ్ రాసిన 'ఇండియాస్ మోస్ట్' అనే పుస్తకంలోని 'మేజర్ వరదరాజన్' చాప్టర్ ను బేస్ చేసుకుని రూపొందించబడుతోంది.

షూటింగ్ లో రవితేజకు గాయం
మాస్ మహారాజా రవితేజకు ఆర్ టి 75 షూటింగ్ లో గాయమైంది.తన కుడి చేతికి ఇంతకుముందే గాయం ఉండగా అలానే షూటింగ్ లో పాల్గొనడంతో ఆ గాయం కాస్త తీవ్రమైంది.దాంతో నిన్న యశోద హాస్పిటల్ లో గాయానికి విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది.సర్జరీ పూర్తి కావడంతో 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.దాంతో రవితేజ మరో 42రోజుల వరకు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వనున్నాడు.

తంగలాన్.. సెకండ్ వీక్‌లో పెరిగిన స్క్రీనింగ్స్
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ద సినిమాలలో 'తంగలాన్' ఒకటి. భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి తన వెండితెర మాయాజాలం చేశాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అన్ని సెంటర్స్ నుంచి సక్సెస్‌ఫుల్ టాక్‌తో పాటు మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

మట్కా షూటింగ్ అప్డేట్
మెగా హీరో వరుణ్ తేజ్,పలాస ఫేమ్ కరుణ కుమార్ కాంబోలో వస్తున్న చిత్రం మట్కా.1980 బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.ఇందులో వరుణ్ డాన్ పాత్రలో కనిపించనున్నాడు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కాకినాడ లో జరుగుతుంది.ఈసందర్భంగా మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.వరుణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.

కన్నప్ప.. కృష్ణాష్టమి సందర్భంగా అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు.

సరిపోదా శనివారం రన్ టైమ్ ఎంతో చెప్పేసిన నాని
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

గ్రాండ్ గా కిరణ్ అబ్బవరం -రహస్య వివాహం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం,హీరోయిన్ రహస్య గోరక్ ల వివాహం గురువారం రాత్రి కర్ణాటకలోని కూర్గ్ లో ఘనంగా జరిగింది.కూర్గ్ లోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు,సన్నిహితులైన మిత్రుల సమక్షంలో వీరి వివాహ వేడుకలు జరిగాయి.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.సినీ ప్రియులు,చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు.