యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటి మేఘా ఆకాశ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలకమైన అడుగువేశారు. ఓ వైపు నటిగా పలు సినిమాల్లో నటిస్తున్న ఆమె హఠాత్తుగా పెళ్ళికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిన్న తన ప్రియుడు సాయి విష్ణుతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ మేరకు విషయాన్ని మేఘా ఆకాశ్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా తన ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఇక ప్రైవేట్‌గా జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. కాగా మేఘా ఆకాశ్, సాయి విష్ణు గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారని సమాచారం. ఎట్టకేలకు వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు మద్దతు తెలుపడంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే వీరి వివాహం ఎప్పుడనేది తెలియాల్సివుంది.
ఇక టాలీవుడ్ హీరో నితిన్ నటించిన ‘లై’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మేఘా ఆకాశ్. అనంతరం ఛల్ మోహనరంగ, రాజరాజ చోర, డియర్ మేఘ, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, మనుచరిత్ర వంటి సినిమాల్లో నటించింది. ఇటీవలే కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన తుఫాన్ (తెలుగులో) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాగా మేఘా ఆకాశ్ ప్రస్తుతం వికటకవి, సహకుటుంబం సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. మరి వివాహం తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌ను కొనసాగిస్తుందా..? లేదా.,? అనేది అభిమానులను వేధిస్తోన్న ప్రశ్న.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: