తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతూనే వుంది.ముఖ్యంగా స్టార్ హీరోల బర్త్ డే లకు వారు నటించిన కల్ట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఆనవాయితీగా మారింది.అందులో భాగంగా నిన్న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ఇంద్ర మళ్ళీ థియేటర్లలోకి వచ్చింది.ఇక ఈ రీ రిలీజ్ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.మొదటి రోజు ఈసినిమా 3.05 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుందని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది.దాంతో సీనియర్ హీరోల రీ రీలీజ్ సినిమాల్లో రికార్డు ఓపెనింగ్ పెట్టింది ఇంద్ర.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక 2002 లో వచ్చిన ఇంద్ర రికార్డులు బ్రేక్ చేసి సెన్సేషన్ సృష్టించింది.బి గోపాల్ ఈసినిమాను తెరకెక్కించగా సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లు గా నటించారు.మణిశర్మ ఇచ్చిన పాటలు థియేటర్లను షేక్ చేశాయి.22 ఏళ్ల తరువాత మళ్ళీ ఇప్పుడు ఇంద్ర రీలీజ్ అయ్యింది.
ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరలో నటిస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వశిష్ఠ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈసినిమా జనవరి 10న రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























