కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 183

devara movie power powerful glimpse out now
ట్రైలర్ & టీజర్

దేవర పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. ఎన్టీఆర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా రోజులవ్వడంతో ఫ్యాన్స్ ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ సమ్మర్ లో రాబోతుంది. ఇప్పటికే ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్, అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

TFN Adminవాట్సాప్
Special VFX Team For Kamal Haasan Indian 2
సినిమా వార్తలు

ఇండియన్ 2 కోసం స్పెషల్ విఎఫ్ఎక్స్ టీమ్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. అయితే రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ పూర్తయింది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి మరొక ఇంట్రెస్ట్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమా క్లైమాక్స్ కోసం శంకర్ ఒక స్పెషల్ విఎఫ్ఎక్స్ టీమ్ తో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Hanuman team offer 5 rupees for Ayodhya Rama Mandir from every ticket
సినిమా వార్తలు

హనుమాన్ టీమ్ గొప్ప నిర్ణయం.. ప్రతి టికెట్ పై రూ.5 విరాళం

ఆదిపురుష్ సినిమా రిలీజ్ టైమ్ లో ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం స్పెషల్ గా సీట్ కేటాయించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు హనుమాన్ టీమ్ కూడా మంచి నిర్ణయంతో వచ్చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Geethanjali Malli Vachindhi movie shoot completed
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తిచేసుకున్న గీతాంజలి మళ్లీ వచ్చింది

హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది కామన్ అయిపోయింది. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుంది. అంజ‌లి ప్ర‌ధాన పాత్రలో వచ్చిన కామెడీ ప్లస్ హార్రర్ మూవీ 'గీతాంజ‌లి' సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈసీక్వెల్ రానుంది. శివ తుర్ల‌పాటి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
OG Producers respond to rumors
సినిమా వార్తలు

ఓజి చేతులు మారనుందా ...క్లారిటీ ఇచ్చేశారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజి.సుజీత్ పవన్ కు వీరాభిమాని కావడం అలాగే సినిమా గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో వస్తుండడంతో ఓజి అనౌన్స్ మెంట్ దగ్గరనుండి భారీ అంచనాలు మొదలయ్యాయి.మధ్యలో టీజర్ ను కూడా విడుదలచేశారు ఇక ఆ టీజర్ ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.అలా సినిమాపై అంచనాలు మరింత గా పెరిగిపోయాయి.వీటికి తోడు సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి షూటింగ్ కూడా బాగా ఫాస్ట్ గా జరగడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.అయితే మధ్యలో బ్రేక్ రావడంతో ఇంకా సగం షూటింగ్ బ్యాలెన్స్ వుంది.

Mahender Reddyవాట్సాప్
naa saami ranga movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

నా సామిరంగ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

సంక్రాంతి బరిలో పలు సినిమాలు దిగనున్న సంగతి తెలిసిందే కదా. ఇక వాటిలో నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా కూడా ఒకటి. చాలా సినిమాలు పోటీలో ఉన్నా ఏమాత్రం తగ్గేది లేదంటూ వచ్చేస్తున్నాడు నాగ్ కూడా. ప్రముుఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ గా వస్తుంది నా సామిరంగ. ఈసినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు అల్లరి న‌రేష్, రాజ్ తరుణ్ ఇంట్రో వీడియోలు పాటలు,టీజర్ రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

TFN Adminవాట్సాప్
guntur kaaram movie trailer out now
ట్రైలర్ & టీజర్

మాస్ తో అదరగొట్టిన గుంటూరు కారం ట్రైలర్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వ‌స్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్టర్లు, టీజర్ అలానే లిరికల్‌ సాంగ్స్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రీసెంట్ గా రిలీజ్ అయిన కుర్చీ మడతపెట్టి సాంగ్ మాత్రం సోషల్‌ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
kalyan ram devil movie successfully entered in second week
సినిమా వార్తలు

సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి డెవిల్

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా డీసెంట్ హిట్ నే అందుకుంది. సుభాష్ చంద్రబోస్, అతని అనుచరులని బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, మరో వైపు హత్య కేసు ఛేదించడం.. ఇలా డెవిల్ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Naa Saami Ranga Director Vijay Binni Reveals Interesting Facts About Movie
సినిమా వార్తలు

నా సామిరంగ టైటిల్ పెట్టడానికి కారణం అదే - డైరెక్టర్ విజయ్ బిన్ని

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సామిరంగ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు విజయ్ బిన్ని విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Time Locked For The Release Of Devara Glimpse
ట్రైలర్ & టీజర్

దేవర గ్లింప్స్ రిలీజ్ కు టైం ఫిక్స్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ గ్లింప్స్ ఈనెల 8న విడుదలకానుందని తెలిసిందే.ఇక ఇప్పుడు టైం కూడా చెప్పేశారు.సోమవారం సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేయనున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ గ్లింప్స్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించాలనే వుంది.ఈ గ్లింప్స్ తో సినిమా ఎలా వుండబోతుందో చెప్పనున్నారు.గ్లింప్స్ మాత్రం అదిరిపోతుందట ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా భారీ విఎఫ్ఎక్స్ తో ఈగ్లింప్స్ రానుందట.

Mahender Reddyవాట్సాప్
thandel glimps gets super response from fans
ట్రైలర్ & టీజర్

తండేల్ గ్లింప్స్ కు అక్కినేని ఫ్యాన్స్ ఫిదా

నాగ చైతన్య ,చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా తండేల్.ఈరోజు ఎస్సెన్స్ అఫ్ తండేల్ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఇక ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది.చైతన్య లుక్స్ తోపాటు బీజీఎమ్ ,విజువల్స్ గ్లింప్స్ లో హైలైట్ అయ్యాయి.చైతన్య శ్రీకాకుళం స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పగా దేశ భక్తిని కూడా జోడించారు.ఇక వీడియో చివర్లో హీరోయిన్ సాయి పల్లవిని కూడా చూపెట్టారు.గ్లింప్స్ చూస్తుంటే ఈసారి నాగ చైతన్య కు కావాల్సిన హిట్ వచ్చేలానే ఉంది.

Mahender Reddyవాట్సాప్
nasser first look poster released from naa saamiranga movie
ఫస్ట్ లుక్

నా సామిరంగ నుండి నాజర్ ఫస్ట్ లుక్ రిలీజ్

విజయ్‌ బన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. చాలా రోజుల తరువాత నాగార్జున మళ్లీ ఈసినిమాలో మాస్ రోల్ తో ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. దీంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్లు ఇచ్చారు మేకర్స్. వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న మరోపాత్రకు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. నాజర్ కూడా ఈసినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుండగా తాజాగా తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మా పెద్దయ్యని పరిచయం చేస్తున్నాం అంటూ నాజర్ లుక్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Saindhav Actor Nawazuddin Siddiqui Praises Hero Venkatesh
సినిమా వార్తలు

వెంకటేష్ గారి నుంచి అది నేర్చుకున్నాను - సైంధవ్ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ

విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో తెలుగులో పరిచయం అవుతున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలేకర్ల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
dhanush captain miller trailer released
ట్రైలర్ & టీజర్

కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ రిలీజ్

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. 1930 - 40ల బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ మూవీగా పుల్ యాక్షన్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా పొంగల్ కు రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Nara Rohit's 20th Movie Shoot Begins
సినిమా వార్తలు

ఘనంగా ప్రారంభమైన నారా రోహిత్ 20వ చిత్రం

టాలీవుడ్ హీరోలలో నారా రోహిత్‌ది ప్రత్యేక శైలి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా భిన్నమైన కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తుంటారు. గత కొంతకాలంగా ఆయన నుంచి సినిమాలేవీ రాలేదు. అయితే ఇటీవలే ‘ప్రతినిధి 2’ తో మళ్లీ సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇస్తున్నారు నారా రోహిత్. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. కాగా ఇది రోహిత్‌కి 20వ చిత్రం (#NaraRohit20) కావడం విశేషం. ఈ మూవీని సందీప్ పిక్చర్ ప్యాలెస్ (ఎస్‌పీపీ) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళ్లి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
a r rahman on board for ram charan and buchi babu movie
సినిమా వార్తలు

RC16 కోసం ఏ.ఆర్ రెహమాన్.. చరణ్ స్పెషల్ బర్త్ డే విషెస్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
tamil nadu vels university offers doctorate to janasena leader pawan kalyan
సినిమా వార్తలు

డాక్టరేట్ ను తిరస్కరించిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలతోనూ అలానే మరోపక్క రాజకీయాలతోనూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే రీఎంట్రీ తరువాత వరుసగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలతో బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకోగా ఇంకా పలు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. వాటిలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్. ఈసినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా ఒకటి. ఈసినిమా కూడా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి…

TFN Adminవాట్సాప్
Geethanjali Malli Vachindi Movie First Look Poster Released
ఫస్ట్ లుక్

గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్

తెలుగు అమ్మాయి అంజలి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న తాజా చిత్రం 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. 2014లో వచ్చిన సూప‌ర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
ayalaan release date out
రిలీజ్ అప్‌డేట్

అయలాన్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈసంక్రాంతికి డబ్బింగ్ సినిమా అయలాన్ కూడా విడుదలకానున్న సంగతి తెలిసిందే.శివ కార్తికేయన్ హీరోగా నటించగా రవి కుమార్ డైరెక్ట్ చేశాడు.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తుంది.హీరోకి ఏలియన్ తోడై ఏం చేశారు అనే కాన్సెప్ట్ తో వస్తుంది.నిన్న ట్రైలర్ ను కూడా విడుదలచేశారు.

Mahender Reddyవాట్సాప్
kotabommali ps movie ott release date fixed
ఓటీటీ

కోట బొమ్మాళి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా కోట బొమ్మాళి. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలసిందే. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది.ఈసినిమాకు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయన ఆహా వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11వ తేదీన ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్

షేర్