తెలుగు అమ్మాయి అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇది అంజలి నటిస్తోన్న 50వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ, సునీల్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, రవిశంకర్, ప్రియ, ముక్కు అవినాష్, విరుపాక్ష రవి, రాహుల్ మాధవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్లో చీకటి గదిలో అంజలి, అలీ, సునీల్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, షకలక శంకర్ అందరూ పక్కపక్కనే నిలబడి పైకి చూస్తున్నారు. అంజలి చేతిలో ఒక బొమ్మ ఉండగా.. వారి మొహాల్లో భయం కట్టొచినట్లు కనిపిస్తోంది.
కాగా యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ఎప్పుడూ ముందుండే కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఈ సినిమా ద్వారా తన మార్క్‌ను చాటుకుంటోంది. కామెడీ అండ్ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు రాహుల్ మాధవ్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. అలాగే ‘నిన్ను కోరి’, ‘నిశ్శబ్దం’ చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన అట్లాంటా (యూఎస్)కు చెందిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటిని డైరెక్టర్‌గా ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























