అయలాన్ రిలీజ్ డేట్ ఫిక్స్ 

ayalaan release date out

ఈసంక్రాంతికి డబ్బింగ్ సినిమా అయలాన్ కూడా విడుదలకానున్న సంగతి తెలిసిందే.శివ కార్తికేయన్ హీరోగా నటించగా రవి కుమార్ డైరెక్ట్ చేశాడు.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తుంది.హీరోకి ఏలియన్ తోడై  ఏం చేశారు అనే కాన్సెప్ట్ తో వస్తుంది.నిన్న ట్రైలర్ ను కూడా విడుదలచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టన్నింగ్ విజువల్స్ అదిరిపోయిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో వచ్చిన ఈట్రైలర్ సినిమా ఫై అంచనాలను పెంచేసింది.తెలుగు వెర్షన్ ట్రైలర్ ఇప్పటివరకు యూట్యూబ్ లో 8లక్షలకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.ఇక ట్రైలర్  లో రిలీజ్ డేట్ ను కూడా చెప్పేశారు.

జనవరి 12న ఈసినిమా తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.తమిళ్ లో అయలాన్ కు పెద్దగా పోటీ ఏం లేదు కానీ తెలుగులో మాత్రం తీవ్రమైన పోటీ ఎదుర్కోనుంది.ఎందుకంటే అదే రోజు గుంటూరు కారం,హనుమాన్ సినిమాలు విడుదలవుతున్నాయి.గుంటూరు కారం క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.హనుమాన్ కు కూడా మంచి బజ్ వుంది మరి వీటిని తట్టుకొని అయలాన్ ఎంత వరకు ఓపెనింగ్స్ ను రాబట్టుకుంటుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.